- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మునుగోడు అభివృద్ధే నా లక్ష్యం..ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
తనకు పదవి ఉన్నా లేకున్నా మునుగోడు ప్రజలకే నా జీవితం అంకితం అని ఈ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు.

దిశ, మునుగోడు : తనకు పదవి ఉన్నా లేకున్నా మునుగోడు ప్రజలకే నా జీవితం అంకితం అని ఈ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం మండల కేంద్రంలోని స్థానిక అధికారిక క్యాంపు కార్యాలయంలో మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా మొదటి దశలో మంజూరైన ఇల్లు నిరుపేదలకు మంజూరి పత్రాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చండూరు, మునుగోడు, నాంపల్లి, మర్రిగూడెం, గట్టుప్పల్ మండలాలలో ఇందిరమ్మ ఇల్లులు మంజూరైన లబ్ధిదారులకు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యంతో కలిసి ఇందిరమ్మ ఇల్లుల మంజూరి పత్రాలను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇండ్లు రాని వాళ్ళు అధైర్య పడొద్దని అర్హులైన పేద వాళ్ళందరికీ ఇండ్లు ఇప్పించే బాధ్యత నాదన్నారు.
మునుగోడు నియోజకవర్గంలో కనీసం పదివేల ఇండ్లు మంజూరి అవసరం ఉందని కానీ ప్రస్తుతానికి 3500 మంజూరు అయ్యాయన్నారు. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చెబుతున్నా పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లులు మా ప్రభుత్వం ఇస్తుందన్నారు. నియోజకవర్గంలో కనీసం పదివేల మందికి ఇందిరమ్మ ఇండ్లు కావాలని, ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఇల్లు అనేది ప్రతి ఒక్కరికీ ఆత్మ గౌరవమని గత పది సంవత్సరాలలో ప్రభుత్వం ఏ ఒక్కరికి ఇల్లు కట్టిన పాపాన పోలేదన్నారు. ఇళ్ల కేటాయింపులో అధికారులు పూర్తి పారదర్శకంగా పాటించాలన్నారు. ప్రభుత్వం ఇంటి కోసం మంజూరు చేస్తున్న 5 లక్షల రూపాయలు సరిపోవని ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి నల్గొండ జిల్లాలోని అన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నందున డిస్కౌంట్ పై సిమెంట్ ఇచ్చే విధంగా లబ్ధిదారులకు మేలు జరిగేలా మాట్లాడతాన్నారు. నిరంతరం ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం కృషి చేస్తానని నిరుపేద కుటుంబాల అందరికీ సొంతింటి కళ నెరవేరే వరకూ పోరాడుతానన్నారు.
శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం మాట్లాడుతూ సంవత్సరాల తరబడి పూరి గుడిసెలో నివసిస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం సంతోషకారణమన్నారు. మునుగోడు నియోజకవర్గం పూర్తిగా ఫ్లోరైడ్ ప్రాంతమని, సుమారు 1500 ఫీట్లు బోరూ వేసినా నీరు పడని పరిస్థితి దాపరించిందన్నారు. అర్హులకే అన్ని ప్రభుత్వ పథకాలు అందేలా చూసే బాధ్యత అధికారులపై ఉందని అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి లో భాగంగా డిండి,ఎస్ఎల్బీసీ, బ్రాహ్మణ వెల్లంల సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే మునుగోడు సస్యశ్యామలం అవుతుందన్నారు. క్షేత్ర స్థాయిలో మరోసారి పూర్తిగా పరిశీలించి అర్హులైన నిరుపేదలందరికీ ఇండ్లు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ, అమిత్, రెవిన్యూ, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ ధోటి నారాయణ, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, తదితరులు పాల్గొన్నారు.






