సమన్వయంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలి : ఎంపీ చామ‌ల కిర‌ణ్ రెడ్డి

by Ratna Kumari |

దిశ, శాలిగౌరారం : సమన్వయంతో బండమీది గూడెం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సమిష్టిగా కృ

సమన్వయంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలి : ఎంపీ చామ‌ల కిర‌ణ్ రెడ్డి
X

దిశ, శాలిగౌరారం : సమన్వయంతో బండమీది గూడెం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సమిష్టిగా కృషి చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని బండమీది గూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గా గెలుపొందిన అన్నెబోయిన పుష్పమ్మ-సుధాకర్, పాలకవర్గం తో కలిసి హైదరాబాద్ లోని అంబర్ పేట్ లోని ఎంపీ క్యాంపు కార్యాలయం లో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని మర్యాద పూర్వ కంగా కలిశారు. ఈ సందర్బంగా ఎంపీ చామల నూతన సర్పంచ్, వార్డు సభ్యులను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి తమ వంతు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందజేస్తానని పార్టీలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అన్నెబోయిన సుధాకర్,ఉప సర్పంచ్ కప్పల పవిత్ర-లింగయ్య,వార్డు మెంబెర్ లు కప్పల యాదగిరి,అన్నెబోయిన కృష్ణవేణి -కిరణ్,సిరిగిరి సైదులు,కళ్లెం రాములు పాల్గొన్నారు.

Next Story