- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోటర్ దొంగల ముఠా అరెస్ట్...
గత నాలుగు సంవత్సరాలుగా వ్యవసాయ బావుల వద్ద మోటార్లను దొంగతనం చేస్తున్న ముఠాను నార్కట్ పల్లి పోలీసులు శుక్రవారం ఉదయం పట్టుకున్నారు.

దిశ, నార్కట్ పల్లి : గత నాలుగు సంవత్సరాలుగా వ్యవసాయ బావుల వద్ద మోటార్లను దొంగతనం చేస్తున్న ముఠాను నార్కట్ పల్లి పోలీసులు శుక్రవారం ఉదయం పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 9.60 లక్షల విలువచేసే 24 మోటార్లను సేకరించి రిమాండ్ చేశారు. నల్లగొండ డిఎస్పి శివరాం రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్ పల్లి మండలం షా పల్లి గ్రామానికి చెందిన మాగి నాగరాజు, సుద్దాల నరసింహ, బకరం శేఖర్, భాషాపాక సైదులు, నల్లమాద లింగయ్య, భాషాపాక లింగయ్యలు గత నాలుగేళ్లుగా నార్కట్ పల్లి మండలం షాపల్లి, తొండలవాయి నక్కలపల్లి గ్రామాల్లో, కట్టంగూరు మండలం నారెగూడెం, ఈదులూరు గ్రామాల్లో మోటార్లు దొంగతనం చేస్తున్నారు. అప్పటికే ఈనెల తొమ్మిదవ తేదీన షాపల్లి గ్రామానికి చెందిన కన్నబోయిన శ్రీను వ్యవసాయ బావి వద్ద మోటార్ దొంగిలించబడింది.
ఆయన ఫిర్యాదు మేరకు ఎస్పీ శరత్చంద్ర ఆదేశాల ప్రకారం దొంగలపై పూర్తి దృష్టి సారించాం. అదే క్రమంలో శుక్రవారం ఉదయం నార్కట్ పల్లి మండల కేంద్రంలోని అమ్మనబోలు రోడ్డు చౌరస్తా వద్ద రెండు ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పదంగా వెళ్తున్న వారిని విచారించాం. అందులో మాగి నాగరాజు తాము ఒక ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నామని ఒప్పుకున్నట్లు తెలిపారు. వెంటనే వారందరినీ పట్టుకొని విచారించి వారి వద్ద ఉన్నటువంటి మోటార్లన్నింటిని సేకరించాం. ఆ ముఠాలోని ఆరుగురుపై నార్కట్పల్లి, కట్టంగూరు మండలాల్లో వివిధ సెక్షన్లలో కేసులు నమోదు చేసి రిమాండ్ చేసినట్లు తెలిపారు. వీరు జలసాలకు అలవాటు పడి వ్యవసాయ బావుల వద్ద మోటార్లను దొంగతనం చేస్తున్నారన్నారు. వ్యవసాయ బావుల వద్ద ఎటువంటి దొంగతనాలు జరిగిన వెంటనే పోలీసుల దృష్టికి తీసుకువచ్చి ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. ముఠాను పట్టుకున్నటువంటి నార్కట్ పల్లి సిఐ కె. నాగరాజు, ఎస్సై డి. క్రాంతి కుమార్, హెడ్ కానిస్టేబుల్ రాము, కానిస్టేబుల్ గిరిబాబు, సత్యనారాయణ, శివశంకర్, తిరుమల్ మరియు ఇతర సిబ్బందిని డిఎస్పి ప్రశంసించారు.






