ట్రంప్ ముందు సాష్టాంగ ప్రమాణం చేస్తూ మోకరిల్లిన మోడీ : సీపీఎం పొలిట్ బ్యూరో స‌భ్యులు బీ.వీ. రాఘ‌వులు

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-01-10 13:14:15  IST  )

కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం అమెరికా ప్రభుత్వం ట్రంప్ ముందు వంగి సాష్టాంగముగా ప్రమాణం చేస్తూ మోకరిల్లుతున్నారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విమర్శించారు.

ట్రంప్ ముందు సాష్టాంగ ప్రమాణం చేస్తూ మోకరిల్లిన  మోడీ : సీపీఎం పొలిట్ బ్యూరో స‌భ్యులు బీ.వీ. రాఘ‌వులు
X

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం అమెరికా ప్రభుత్వం ట్రంప్ ముందు వంగి సాష్టాంగముగా ప్రమాణం చేస్తూ మోకరిల్లుతున్నారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విమర్శించారు. శనివారం భువనగిరి సుందరయ్య భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోని 140 కోట్ల జనాభాకు విశ్వగురు అని చెప్పుకునే మోడీ మౌనం పాటిస్తున్నాడన్నారు. భారతదేశానికి భంగం కలిగే విధంగా మోడీని మన దేశ నాయకత్వాన్ని అమెరికా అవమాన పరుస్తున్న నోరు విప్పడం లేదన్నారు. మోడీ ట్రంప్ కు ఫోన్ చేయకపోవడంతోనే భారత్ పై భారీగా వాణిజ్య జరిమానాలు ద్వైపాక్షిక బిల్లు పడ్డాయని రిపబ్లిక్ సెనిటర్ లిండ్సే గ్రహం వెల్లడించిన విషయాన్ని ప్రస్తావించారు. మోడీ ట్రంప్ తో 8సార్లు మాట్లాడారని భారత దేశ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే విధంగా మన నాయకులు, విదేశీ మంత్రిత్వ శాఖ మాట్లాడుతుందన్నారు. ప్రపంచ టెర్రరిస్ట్ లాగా అమెరికా వెనిజులపై దాడి చేసి ఆ దేశపు అధ్యక్షులు మధురో, అతని భార్యను ఎత్తుకపోయి నిర్బంధించిన మోడీ మౌనం వీడడం లేదన్నారు. ప్రపంచ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ట్రంపు చర్యలను మోడీ ఖండించాలని డిమాండ్ చేశారు. వెనుజులపై అమెరికా టెర్రరిస్టుల మాదిరిగా వ్యవహరిస్తుంటే, భారతదేశం నాయకులు ఉభయలు చర్చించుకుని శాంతిగా ఉండాలని ప్రకటించడం సరైనది కాదన్నారు. నాకు సంతోషం కలిగించే విధంగా మోడీ వ్యవహరిస్తున్నాడని ట్రంప్ చులకనగా చూస్తున్నాడన్నారు. ఇది భారతదేశాన్ని చులకన చేయడమేనని పేర్కొన్నారు. అమెరికా చర్యలను అనేక ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయన్నారు. చైనా, రష్యా తో పాటు బ్రెజిల్, స్పెయిన్, కొలంబియా, మెక్సికో,ఉరుగ్వే సహా అనేక దేశాలు అమెరికా చర్య పై మండిపడుతున్నారన్నారు. ఒక దేశ సర్వ భౌమాధికారాన్ని అమెరికా ఉల్లంఘిస్తుంటే మన దేశం స్పందన లేదన్నారు. వెనుజులతోపాటు ఇక గ్రీన్లాండ్ పై ట్రంప్ కన్నేశారన్నారు. యుతోన్మాదిగా మారారని తెలిపారు. భారత్ పై ట్రంప్ మాట్లాడడం పై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించి మన గౌరవాన్ని కాపాడేందుకు మోడీ కృషి చేయాలన్నారు.

రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలి

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న వివాద సమస్యలను సామరస్యంగా ద్వారా పరిష్కరిస్తామని తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం నీ స్వాగతిస్తున్నామన్నారు. వివాదాస్పద సమస్యలను చర్చల ద్వారా, నిపుణుల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. రెండు రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు గా ఉన్న బిఆర్ఎస్, వైఎస్ఆర్సిపి అధికార పార్టీపై అక్కసు తో కాకుండా రెండు తెలుగు ప్రజల మధ్య సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి చొరవ చూపెట్టాలన్నారు. రాష్ట్రాలు ఏర్పడి దశాబ్ద కాలం పూర్తయిన సమస్యలు పరిష్కారం కాకపోవడం బాధాకరమన్నారు. కాల పరమితి ప్రకటించుకుని రెండు రాష్ట్రాలు ముందుకు పోవాలన్నారు.

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరించొద్దు

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ మూడవ దశ పూర్తి చేసుకుని ముందుకు పోతుందని ఈ ప్లాంట్లో వివిధ విభాగాలను ప్రైవేటు వారికి ధారా దత్తం చేయడానికి ప్రయత్నిస్తున్నారని దాన్ని వెంటనే విరమించుకోవాలని కోరారు. నిర్మాణంలో పాలుపంచుకున్న జెన్కో కు వీటిని నిర్వహణ చేసే సామర్థ్యం ఉందని వారికే కేటాయించాలని కోరారు. విద్యుత్ ఉత్పాది కేంద్రాలను చేజిక్కించుకుంటున్న అదాని ఆధీనంలోకి ఈ ప్రాజెక్టు వెళ్లకుండా జన్కో నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి బీజేపీ కుట్ర

కేంద్ర ప్రభుత్వం 2025లో తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టం స్థానంలో విబి జి రాంజీ చట్టాన్ని తీసుకురావాలని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రము దేశంలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉపాధి హామీ చట్టాన్ని వినియోగించుకుంటుందని ఆవేదన వ్యక్తపరిచారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రం తీసుకొచ్చిన జి రాంజీ చట్టాన్ని వ్యతిరేకించడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉపాధి హామీ చట్టాన్ని 28 రోజులు మాత్రమే వాడుకున్నారన్నారు. ఉపాధి హామీ పథకాన్ని పూర్తిస్థాయిలో రాష్ట్రంలో వినియోగించుకుంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంపై రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమంచాలని కోరారు. కార్పొరేట్ లాభాల కోసం తక్కువ ధరకు కూలీలను దొరికే విధంగా పేదల బతుకులు బలి పెడుతుందని పేర్కొన్నారు.

అటవీ , ఖనిజ సంపదను దోచుకోవడానికి మావోయిస్టులపై దాడులు

దేశంలో ఉన్న అటవీ సంపదను, అక్కడ ఉన్న ఖనిజ సంపదను తమ అనుంగ కార్పోరేట్ శక్తులైన అదానీ, అంబానీ, మిట్టల్ లాంటి సంస్థలకు కేటాయించి, దోచుకోవడానికి మావోయిస్టులపై అక్కడ ఉన్న ఆదివాసీలపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. మావోయిస్టులతో సైదాంతిక విభేదాలు ఉండవచ్చు కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాలన్నారు. మావోయిస్టులపై దాడులు ప్రజల కోసమో, గిరిజనుల కోసం కాదని అటవీ సంపద కోసమేనని పేర్కొన్నారు. మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్లు చేయడం రాజ్యం చేసే పని కాదన్నారు. అది నిరంకుశం ప్రభుత్వాలు చేసే పని అన్నారు. మావోయిస్టు సిద్ధాంతాన్ని మేము కూడా అంగీకరించమని పేర్కొన్నారు. వారు మన దేశం వాళ్లని పేర్కొన్నారు. చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. వేలాది మంది సైన్యం వారిపై దాడులు చేస్తుందన్నారు. మరోవైపు హత్యలు, బూటకపు ఎన్కౌంటర్లు, కొనుగోలు ( ఆర్థిక సహాయ ఆశ చూపడం) కు పాల్పడుతుందన్నారు. జల వనరులను దోచుకోవడానికి కృషి చేస్తున్నారన్నారు. సీలేరు శబరి నీటి పంపు స్టోరేజీలు అదానికి ఇచ్చారన్నారు.

అడవులకు నష్టం

దేశంలోని అటవీ చట్టాలను దెబ్బతీస్తూ మోడీ సర్కార్ నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. దీనివల్ల అడవులకు నష్టమని, జీవవైవిద్యం నశించే ప్రమాదం ఉన్నదని నిపుణులు పర్యావరణ వేతలు అభిప్రాయపడుతున్నారన్నారు. అడవి నుండి వేల సంవత్సరాలుగా నివాసముంటున్న ఆదివాసులను అక్కడి నుండి తరలించడానికి కుట్రలు పన్నుతున్నారన్నారన్నారు. తక్కువ వేతనంతో కూలీలను తీసుకురావడానికి కార్పోరేట్ శక్తులకు లాభం చేకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందన్నారు. దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. దక్షిణ అమెరికాను పెట్టుబడి దారుల దొడ్డి లాగా వ్యవహరిస్తుందన్నారు. లాటిన్ అమెరికాలో సోషలిస్టు ప్రభుత్వం ఉండడం అమెరికాకు నచ్చడం లేదన్నారు. అమెరికా చర్యలను ఖండిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఏనాడు ఏ విషయంలో అమెరికాపై ఇంత వ్యతిరేకత రాలేదన్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ సిపిఎం ఉద్యమాలు పోరాటాలతోటే ఎన్నికలలో ముందుకు పోతుందన్నారు. గతంలో వేసిన ఎత్తుగడలతోనే నష్టపోయామన్నారు. వామపక్షాలు, అభ్యుదయ వాదుల మధ్య ఉన్న చిన్న చిన్న తేడాలను సవరించుకొని ముందుకు పోయి ప్రజలకు మరింత మేలు చేస్తామన్నారు. సరళీకరణ వల్ల పోతున్న ఓకే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు ఆశపడ్డారని అది అంతగా అభివృద్ధి జరగదని గ్రహించారన్నారు. ఎన్నికల కమిషన్ ఓటర్ జాబితా తయారు చేసిన సందర్భంగా బిజెపికి ఉపయోగకరంగా ఎలక్ట్రోడ్ జాబితాను తయారుచేస్తున్నారు. బిజెపికి అనుకూలంగా లేని మహిళలు, మైనార్టీ ఓట్లు తగ్గించేందుకు పనిచేస్తుందన్నారు. మన దేశ పౌరసత్వాన్ని గుర్తించడం భారతదేశంలోకి వచ్చిన ఆక్రమణదారులను గుర్తించడం, వారిని శిక్షించడానికి విదేశీ వ్యవహారాలలో ఒక ప్రత్యేక శాఖ ఉందన్నారు. ఇది నిరంతర ప్రక్రియగా జరగాలని కోరారు. మన దేశంలో కాక నిరంతరం గా పనిచేయకపోవడంతో పాటు ఎన్నికల కమిషన్ ఎన్నికల జాబితాను ఎన్నికలకు ఒక నెల రోజుల ముందు చేయడం అనేక అనుమానాలకు తావిస్తుందన్నారు. ఆక్రమణదారులపై నిరంతరం నిఘా పెట్టాలని కోరారు. ఎన్నికల కమిషన్ మాత్రం ఎన్నికల సందర్భంగా దుర్బుద్ధితో జాబితాలు తయారు చేస్తుందని విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం కేంద్ర కమిటీ మాజీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, సిపిఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ పాల్గొన్నారు.

Next Story