నెల రోజులుగా రాని మిష‌న్ భ‌గీర‌థ నీళ్లు

by Ratna Kumari |

పి. ఏ పల్లి మండలం అక్కంపల్లి గ్రామంలో గత నెల రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. త్రాగు నీరు కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొన్నది.

నెల రోజులుగా రాని మిష‌న్ భ‌గీర‌థ నీళ్లు
X

దిశ, పెద్దఅడిశర్లపల్లి : పి. ఏ పల్లి మండలం అక్కంపల్లి గ్రామంలో గత నెల రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. త్రాగు నీరు కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొన్నది. మిషన్ భగీరథ అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. నిమ్మకు నిరెత్తినట్లుగా మిషన్ భగీరథ అధికారులు వ్యవహరిస్తున్నారు. అక్కంపల్లి కొండరవాస వద్ద అక్కంపల్లి రిజర్వాయర్ వెళ్లే వైపు మిషన్ భగీరథ పైప్ లైన్ లీకై వరద వెళ్తున్న‌ లీకేజీలు మరమ్మతలు చేయించాలని అధికారులకు దృష్టికి తీసుకెళ్లిన అధికారులు స్పందించకుండా గాలికి వదిలేసి అధికారులు పట్టించుకోకుండా వివరిస్తున్నారు. అక్కంపల్లితో పాటు అనేక గ్రామాలకు నీరు రాక ప్రజలు నెలల తరబడి ఇబ్బందులు పడుతున్న కనీసం సమస్య పరిష్కారం కోసం అధికారులు ప్రయత్నించకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలం రావడంతో నీటి వాడకం అధికంగా ఉండడం ప్రజలు నీటికోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నత అధికారులు స్పందించి మిషన్ భగీరథ నీళ్లు సమస్య వెంటనే పరిష్కరించి సరఫరా చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story