- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కోమటిరెడ్డి
రాములబండ సీతారామచంద్రస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఆ గ్రామంలోనే ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

దిశ, వెబ్‌డెస్క్: నల్గొండ మండలం రాములబండ గ్రామంలో శ్రీ సీతా రామచంద్రస్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామస్తులతో కలిసి రథాన్ని లాగడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామస్తులంతా ఏకమై వార్షిక బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం అభినందనీయం అని తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని శ్రీ సీతా రామచంద్రస్వామిని ప్రార్థించినట్లు చెప్పారు. అనంతరం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, స్థానిక సర్పంచ్ చామకూరి శంకర్ గౌడ్, ప్రకాష్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.






