- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కీలక నేత పాకా హనుమంతు మృతి
దిశ, చండూరు : ఒడిశాలోని కందమాల్ జిల్లా గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో

దిశ, చండూరు : ఒడిశాలోని కందమాల్ జిల్లా గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు పాకా హనుమంతు అలియాస్ గణేశ్ ఉయికే మృతి చెందారు. ఆయన స్వస్థలం నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లంల గ్రామం. పాక చంద్రయ్య- పాపమ్మ దంపతులకు ఆరుగురు సంతానం. వారిలో మొదటి సంతానం పాక హనుమంతు అలియాస్ గణేష్ 1961 లో జన్మించారు. హనుమంతు కు ముగ్గురు చెల్లెల్లు, ఇద్దరు తమ్ముళ్లు. మొత్తం ఆరుగురు సంతానం. ఈయన పదవ తరగతి వరకు చండూరులో, ఇంటర్, డిగ్రీ నల్గొండలో చేస్తూ RSU గా రాడికల్ యూనియన్ ప్రెసిడెంట్ గా పని చేశాడు. 45 ఏళ్ల క్రితం ఏచూరి శ్రీనివాస్ RSS, ABVP, BJP. వాళ్లతో గొడవలు వచ్చి అతని మర్డర్ లో కీలకపాత్ర వహించి అజ్ఞాతంలో నక్సల్స్ తో వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇంటికి, ఈ పరిసర ప్రాంతాలల్లో ఎవరికి కనిపించిలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. వాళ్ల నాన్న, అమ్మ చనిపోయినప్పుడు కూడా గ్రామానికి రాలేదని గ్రామస్తులు తెలిపారు.






