- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జోరుగా నకిలీ మద్యం తయారీ...!
నాంపల్లి ఆప్కారి శాఖ పరిధిలో నకిలీ మద్యం తయారీ మద్యం ప్రియులను కలవరపెడుతుంది. చండూరు

దిశ,మర్రిగూడ: నాంపల్లి ఆప్కారి శాఖ పరిధిలో నకిలీ మద్యం తయారీ మద్యం ప్రియులను కలవరపెడుతుంది. చండూరు మర్రిగూడ,నాంపల్లి,గుర్రంపోడు మండలాల పరిధిలో కల్తీ మద్యం తయారీ మళ్లీ ప్రారంభమైనట్లు సమాచారం. ఇటీవల నాంపల్లి , చండూరు మండలాల సరిహద్దు గ్రామంలో నకిలీ మద్యం తయారు చేస్తూ పట్టుబడిన విషయం పాఠకులకు విధితమే. స్థానిక ఎన్నికలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పాత నేరస్తులే రంగంలోకి దిగి మళ్లీ నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కల్తీ మద్యం తయారుచేసి బెల్టు షాపులు ఎక్కువగా ఉన్నా మండలాల్లో పెద్ద ఎత్తున సరఫరా చేసి అక్రమ ఆర్జనకు పాల్పడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కల్తీ మద్యం తయారీ కేవలం నాంపల్లి ఆప్కారి శాఖ పరిధిలోనే రెండుసార్లు తయారీదారులు పట్టుబడుతున్న ఉన్నతాధికారులు మాత్రం చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కల్తీ మద్యం తయారీలో తయారుదారుల తో పాటు అధికారుల పాత్ర కూడా ఉండటంతోనే కల్తీ మద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది. గత 20 ఏళ్లుగా మద్యం వ్యాపారం చేస్తూ ఉన్నవారే కల్తీ మద్యం తయారీలో కీలక పాత్ర వహిస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఆ మండలాల్లోనే కల్తీ మద్యం తయారీ
గత 20 ఏళ్లుగా నాంపల్లి ఆప్కారి శాఖ పరిధిలో ఉన్న గుర్రంపోడు,నాంపల్లి,మర్రిగూడ,చింతపల్లి మండలాలు తోపాటు చండూరు మండలాల్లో సైతం కల్తీ మద్యం తయారు చేస్తూ మద్యం వ్యాపారులు కోట్లకు పడగలెత్తుతున్నారు. మద్యం వ్యాపారంలో ఉంటూ టెండర్లు వేసినప్పుడు రానివారు టెండర్లు వచ్చిన వారితో పార్ట్నర్స్ గా పెద్ద ఎత్తున ఆఫర్ చేసి తామే నడిపిస్తామని నెలవారీగా మీకు ఇంత పంపిస్తామని చెప్పి నౌకరిదారిగా అన్ని వైన్స్లను దక్కించుకుని కల్తీ మద్యానికి తయారుచేస్తున్నట్లుగా తెలుస్తుంది. గత 20 ఏళ్లుగా మద్యం వ్యాపారం లోనే ఉంటూ కొంతమందిని పెంచి పోషిస్తూ వారి చేత షాపులోనే తయారు చేయించడం లేదా వారి వ్యవసాయ క్షేత్రంలో గుట్టుగా తయారు చేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. బై ఎలక్షన్ తర్వాత మర్రిగూడ గుర్రంపోడు చింతపల్లి నాంపల్లి హాలియా మండలాల్లో వైన్ షాపులను సీజేసీ కొంతమందిని అరెస్టు చేసి కేసులు పెట్టారు. కల్తీ మద్యాన్ని తయారుచేసి వైన్ షాపుల నుండే సరఫరా చేసి కోట్లల్లో ఆదాయం పొందవచ్చు అన్న కారణంగా కల్తీ మద్యం తయారు చేసినట్లుగా తెలుస్తుంది. స్థానిక ఎన్నికలు వాయిదా పడడంతో తయారుచేసిన కల్తీ మద్యం బెల్ట్ షాపులకు పెద్ద ఎత్తున తరలించినట్లుగా ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. దసరా పండక్కు ప్రతి బెల్ట్ షాపులో కల్తీ మధ్యనే నిల్వలు ఉన్నాయంటూ మద్యం ప్రియులు మద్యం షాపు యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడక్కడ మద్యం ప్రియులు నిరసనలు వ్యక్తం చేసిన విషయం పాఠకులకు విధితమే.
గతంలో పట్టుబడిన వారి పాత్ర పై అనుమానం
గతంలో కల్తీ మద్యం తయారు చేస్తూ టాస్క్ ఫోర్స్ అధికారులకు పట్టుబడిన వారి పాత్ర పైనే ఉన్నతాధికారులు నిఘా పెట్టినట్లుగా తెలుస్తుంది. కల్తీ మద్యం తయారు కేసులో ఉన్నత రాజకీయ నాయకుల ప్రమేయం ఉండడంతో ఒక్కరిద్దరిని కేసు నుండి అధికారులే తప్పించారు. ప్రస్తుతం తయారవుతున్న నకిలీ మధ్యలో వారి పాత్ర గణనీయంగా ఉన్నట్లు తెలుస్తుంది. వారి వెనక రాజకీయ నాయకులు పాత్ర సైతం ఉన్నట్లుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
సిండికేట్ అయిన షాపుల నుండే కల్తీ మద్యం సరఫరా
నాంపల్లి చండూరు ఆప్కారి శాఖ పరిధిలో ఉన్న మండలాల్లో టెండర్లు దక్కించుకున్న వైన్ షాప్ ల యజమానులు సిండికేట్ గా మారి మద్యం వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సిండికేట్ గా మారి అధికారులను మచ్చిగా చేసుకుని నెమ్మదిగా కల్తీ మద్యం తయారీకి తెరలేపుతున్నారు. అధికారుల మద్యం ప్రియుల కండ్లుగప్పి అర్ధరాత్రి తర్వాత వైన్ షాపు లోనే కల్తీ మద్యం తయారుచేసి సీసాలో నింపి బెల్టు షాపులకు సరఫరా చేస్తున్నారు. కల్తీ మద్యం తయారీ పై మద్యం ప్రియులు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. అధికారులు మామూలుగా మత్తులో పడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఉన్నతాధికారులు ప్రధానంగా దృష్టి సారించి ఆ మండలాల్లో తయారయ్యే కల్తీ మద్య ం గుట్టు రట్టు రాత్రిపూట వైన్స్ లో జరిగే కల్తీ మద్యం తయారీ పై పూర్తిస్థాయిలో విచారణ చేసి అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






