గేదెల కోసం వెతుకుతూ ప్రమాదం ...బ్యాక్‌వాటర్‌ నీటిలో పడి వ్యక్తి మృతి

by Bhanu |

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం చింత్రియాల గ్రామానికి చెందిన బంగారు పార్వతీశం చారి (42) మంగళవారం ఉదయం గేదెల కోసం వెతుకుతూ కిష్టాపురం బ్యాక్‌వాటర్‌ వద్ద ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు.

గేదెల కోసం వెతుకుతూ ప్రమాదం ...బ్యాక్‌వాటర్‌ నీటిలో పడి వ్యక్తి మృతి
X

దిశ చింతలపాలెం : సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం చింత్రియాల గ్రామానికి చెందిన బంగారు పార్వతీశం చారి (42) మంగళవారం ఉదయం గేదెల కోసం వెతుకుతూ కిష్టాపురం బ్యాక్‌వాటర్‌ వద్ద ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. అప్పటి నుంచి అతడు కనిపించకపోవడంతో గ్రామస్తులు,కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. స్థానికులు సమాచారంతో వెంటనే గాలింపు చేపట్టగా, బుధవారం ఉదయం పడవల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. పార్వతీశం వృత్తి వడ్రంగిగా జీవనం సాగించేవాడు. అతనికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ హఠాన్మరణం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story