- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైద్యం వికటించి వ్యక్తి మృతి..ఆస్పత్రి ముందు ధర్నా
ఒక వ్యక్తి ఛాతి నొప్పితో బాధపడుతూ వైద్యుడిని సంప్రదించాడు. వైద్యుడు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి పరిస్థితి క్షీణ

దిశ ఆలేరు టౌన్ : ఒక వ్యక్తి ఛాతి నొప్పితో బాధపడుతూ వైద్యుడిని సంప్రదించాడు. వైద్యుడు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి పరిస్థితి క్షీణించి, చివరికి మృతి చెందిన సంఘటన ఆలేరులో శుక్రవారం చోటు చేసుకుంది. ఆలేరు ఎస్ హెచ్ ఓ యాలాద్రి తెలిపిన వివరాల ప్రకారం యాదగిరిగుట్ట మండలం కంటుమ్ గూడెం గ్రామానికి చెందిన ఏనుగుల ఉదయ్ కుమార్ (40) శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఛాతీ నొప్పి రావడంతో ఆలేరులోని సుధా నర్సింగ్ హోమ్ కు వెళ్లాడు. అక్కడి వైద్యులు ప్రతాపరెడ్డి... ఉదయ్ కుమారును పరీక్షించి అంత బాగానే ఉంది చెప్పి నొప్పి తగ్గించేందుకు ఇంజక్షన్ ఇచ్చాడు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాదుకు వెళ్లాలని సూచించారు. దీంతో కారులో హైదరాబాద్ కు బయలుదేరారు. కొద్ది దూరం వెళ్ళాక ఫిట్స్ రావడంతో వెంటనే ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందాడని చెప్పారు వైద్యులు. మృతుని భార్య కావేరి, 8 ఏళ్ల వయసులో ఉన్న ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కావేరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ హెచ్ఓ యాలా ద్రి చెప్పారు.
బంధువుల ఆందోళన
సుధా నర్సింగ్ హోమ్ వైద్యుడు ఇచ్చిన ఇంజక్షన్ వికటించిన కారణంగానే ఉదయ్ కుమార్ మృతి చెందాడని అతని బంధువులు, గ్రామస్తులు ఆరోపించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి..బాధితులకు నచ్చజెప్పారు.






