- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి శంకుస్థాపన
నేరేడుగొమ్ము మండలంలోని తిమ్మాపురం గ్రామంలో మహిళా సమాఖ్య (VO) భవన నిర్మాణానికి సర్పంచ్ పంబాల స్వాతి ముత్యం శంకుస్థాపన నిర్వహించారు.

దిశ, నేరేడుగొమ్ము : నేరేడుగొమ్ము మండలంలోని తిమ్మాపురం గ్రామంలో మహిళా సమాఖ్య (VO) భవన నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. NREGS పథకం కింద రూ.10 లక్షల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. గ్రామ సర్పంచ్ పంబాల స్వాతి ముత్యం శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. మహిళా సంఘబంధం అధ్యక్షురాలు కర్ణకంటి సరస్వతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహిళల సమావేశాలు, స్వయం సహాయక సంఘాలు చేపట్టే పలు కార్యక్రమాలకు ఈ భవనం ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నీలం ఆంజనేయులు, మండల కాంగ్రెస్ నాయకులు ఇప్ప బస్వారెడ్డి, మాజీ పీఏసీఎస్ చైర్మన్ బైరెడ్డి కొండల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ గడ్డం వెంకటయ్య, పలుగుతండా సర్పంచ్ లక్ష్మి ఛత్రునాయక్, ఇప్ప లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచ్ పంబాల పాపయ్య, కుంభం రామకృష్ణ, నాగటి హరీష్, పంచాయతీ కార్యదర్శి శ్రవణ్ కుమార్, జిల్లా లక్ష్మయ్య పాల్గొన్నారు.






