- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మనస్పర్ధల కారణంగా భార్యాభర్తల ఆత్మహత్య
భార్యాభర్తల మధ్య వచ్చిన మనస్పర్ధల కారణంగా ఇరువురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామంలో చోటుచేసుకుంది.

దిశ, చౌటుప్పల్ : భార్యాభర్తల మధ్య వచ్చిన మనస్పర్ధల కారణంగా ఇరువురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గోశిక భాస్కర్(42) కు నవ్యతో గత 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరు ఇరువురికి ఒక పాప, ఒక బాబు కూడా పుట్టారు. 12 సంవత్సరాలుగా వీళ్ళ దాంపత్య జీవితం సాఫీగానే సాగుతున్న ఇటీవలే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తీవ్రస్థాయికి చేరినట్లు సమాచారం. దీంతో గత 14 రోజుల క్రితం భాస్కర్ సతీమణి నవ్య ఆత్మహత్య చేసుకుంది. అయితే నవ్య మృతికి భాస్కర్ కారణమని ఆమె తరపు బంధువులు ఆరోపించడంతో మానసికంగా కృంగిపోయారు. దీంతో సోమవారం తెల్లవారుజామున చేనేత వృత్తికి ఉపయోగించే రసాయనాన్ని తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
మృతుని తల్లి భాస్కర్ ను ఉదయం నిద్ర లేపేందుకు ప్రయత్నించగా ఆయన అప్పటికే మృతి చెందిన విషయాన్ని గమనించింది. జరిగిన విషయాన్ని పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న ఇరువురు మధ్య మనస్పర్ధలు వచ్చి 15 రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంతో వారి ఇద్దరు చిన్నారులు అనాధాలుగా మిగిలిపోయారు. మృతదేహం వద్ద చిన్నారులు దీనంగా కూర్చోవడం చూసి గ్రామస్తులు, బంధువులు కంటతడి పెట్టారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు చౌటుప్పల్ సిఐ మన్మధకుమార్ తెలిపారు.






