దేశవ్యాప్త ఉద్యమంలో భాగస్వాములు కండి : సీఐటియు

by Ratna Kumari |   (  Updated:2026-01-09 16:54:32  IST  )

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక రంగాలకు వ్యతిరేక విధానాలకు నిరసనగా నిర్వహిస్తున్న జీపు జాత ప్రదర్శనలు, సభలను విజయవంతం చేస్తూ దేశవ్యాప్త ఉద్యమంలో భాగస్వాములు కావాలని సీఐటియు జిల్లా నాయకులు ఎస్.కె. బషీర్ పిలుపునిచ్చారు.

దేశవ్యాప్త ఉద్యమంలో భాగస్వాములు కండి :  సీఐటియు
X

దిశ, నాగార్జునసాగర్ : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక రంగాలకు వ్యతిరేక విధానాలకు నిరసనగా నిర్వహిస్తున్న జీపు జాత ప్రదర్శనలు, సభలను విజయవంతం చేస్తూ దేశవ్యాప్త ఉద్యమంలో భాగస్వాములు కావాలని సీఐటియు జిల్లా నాయకులు ఎస్.కె. బషీర్ పిలుపునిచ్చారు. జనవరి 8 నుండి ఫిబ్రవరి 12వ తేదీ వరకు దేశవ్యాప్తంగా జరుగు జీపు జాత కార్యక్రమం శుక్రవారం నాగార్జునసాగర్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా బషీర్ మాట్లాడుతూ, కార్మికులకు సంబంధించిన 44 చట్టాలను రద్దు చేసి 4 కోడ్లను అమల్లోకి తేవడం, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసి అమలు చేస్తున్న వి.బి. రామ్‌జీ చట్టం, జాతీయ విత్తన మరియు విద్యుత్ సవరణ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం కొనసాగుతోందన్నారు. కార్మిక, రైతు, వ్యవసాయ కూలీల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ రాష్ట్రవ్యాప్తంగా సీఐటియు ఆధ్వర్యంలో వివిధ సంఘాలు సంయుక్తంగా దశలవారీ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయని తెలిపారు. జీపు జాత ప్రదర్శనలను విజయవంతం చేసి ఉద్యమాన్ని బలపరచాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఆనంద్ పాల్, రోశయ్య, గోవింద్, నందికొండ మున్సిపాలిటీ నుండి శివ, తాహెర్, వ్యవసాయ కార్మిక సంఘం నుండి రవి నాయక్, కృష్ణారెడ్డి, కొండలు తదితరులు పాల్గొన్నారు.

Next Story