గ్రామీణాభివృద్ధిలో సమగ్ర భవిత ఆక్టివిటీ సెంటర్ లు కీలకమవుతాయి

by Ratna Kumari |

గ్రామీణ అభివృద్ధిలో భవిష్యత్తులో సమగ్ర భవిత ఆక్టివిటీ సెంటర్లు కీలకమవుతాయని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు.

గ్రామీణాభివృద్ధిలో  సమగ్ర భవిత ఆక్టివిటీ సెంటర్ లు కీలకమవుతాయి
X

దిశ, నవాబుపేట : గ్రామీణ అభివృద్ధిలో భవిష్యత్తులో సమగ్ర భవిత ఆక్టివిటీ సెంటర్లు కీలకమవుతాయని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండల పరిధిలోని కారుకొండ గ్రామంలో సమగ్ర శిక్ష నిధులతో నూతనంగా నిర్మించిన సమగ్ర భవిత ఆక్టివిటీ సెంటర్ భవనంతో పాటు నూతన గ్రామపంచాయతీ భవనాలను ప్రారంభించారు. అలాగే . గ్రామంలోని లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్య, అభ్యాసం, నైపుణ్యాల అభివృద్ధిలో సమగ్ర భవిత ఆక్టివిటీ సెంటర్లు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. విద్యార్థులు,యువత ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తును మెరుగుపరుచుకోవాలని ఆయన సూచించారు. గ్రామపంచాయతీ భవనం ద్వారా గ్రామ పరిపాలన మరింత సులభతరం అవుతుందని అన్నారు.

Next Story