- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > నల్లగొండ > పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలి : బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య
పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలి : బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య
by Ratna Kumari |
పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలం అధ్యక్షులు, మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

X
దిశ, తుంగతుర్తి : పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలం అధ్యక్షులు, మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్యాస్ డొమెస్టిక్ సిలిండర్ పై రూ.60, కమర్షియల్ వాటిపై రూ.140 పెంచారని తెలిపారు. పేద, మధ్య తరగతి ప్రజలకు పెను భారంగా మారిన ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వాలు అంటూ గొప్పలు చెప్పుకునే కేంద్ర, రాష్ట్రాలు నేడు వారి సంక్షేమం మంట గలిపాయని అన్నారు.ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైతే తాజాగా కేంద్రం ధరలు పెంచడం లాంటి విషయాలు దారుణంగా మారాయని వివరించారు.
Next Story






