అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల పై కేసు...

by Bhanu |

ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్ల పై అనంతగిరి మండల పోలీసులు కేసు నమోదు చేశారు.

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల పై కేసు...
X

దిశ, అనంతగిరి : ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్ల పై అనంతగిరి మండల పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై నవీన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.... ఆదివారం, సోమవారం ఉదయం సమయంలో జగ్గయ్యపేట మండలం మల్కాపురం గ్రామానికి చెందిన నెమ్మది జక్కయ్య, సనగల వెంకటేశ, లింగబోయిన రమేష్ బాలంత గణేష్, పొత్తుల శేఖర్, బొమ్మన పైన ఉపేందర్, నడికోప్పుల వీరబాబు లు ఎటువంటి అనుమతి లేకుండా దొంగతనంగా ట్రాక్టర్లలో ఇసుకను తరీలుస్తుండగా అనంతగిరి మండలం గ్రామ శివారులో పట్టుపడిచేసి 3 ట్రాక్టర్ల పై ఓనర్లపై కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు.


Next Story