ఆంధ్ర నుంచి తెలంగాణకు అక్రమంగా ధాన్యం రవాణా..

by Bhanu |

ఆంధ్ర- తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని దొండపాడు చెక్‌పోస్ట్ వద్ద అక్రమంగా రెండు లారీలలో ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు దాన్యం తరలిస్తుండగా పట్టుకున్నట్లు గురువారం కోదాడ రూరల్ సీఐ రజిత రెడ్డి విలేకరులకు తెలిపారు.

ఆంధ్ర నుంచి తెలంగాణకు అక్రమంగా ధాన్యం రవాణా..
X

దిశ, చింతలపాలెం : ఆంధ్ర- తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని దొండపాడు చెక్‌పోస్ట్ వద్ద అక్రమంగా రెండు లారీలలో ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు దాన్యం తరలిస్తుండగా పట్టుకున్నట్లు గురువారం కోదాడ రూరల్ సీఐ రజిత రెడ్డి విలేకరులకు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ధాన్యానికి ప్రభుత్వం మద్దతుతోపాటు అధిక ధరలు ఉండడంతో ఆంధ్రాలో పండించిన ధాన్యాన్ని తెలంగాణలో అమ్ముకునేందుకు తరలిస్తున్న రెండు లారీలలోని సుమారు 600 బస్తాలను పట్టుకున్నట్లు తెలిపారు. ఈ దాన్యం గుంటూరు జిల్లా కామెరపూడి నుంచి మిర్యాలగూడెం కు, అలాగే మరో లారీ పల్నాడు జిల్లా దమ్మలపాడు నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నారని పేర్కొన్నారు. ఈ రెండు లారీలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్సై అజయ్ కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.



Next Story