- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ష్.. గప్ చుప్.. హాలియాలో అబార్షన్ మాఫియా..?
ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుంటున్న నేటి సమాజంలో ఆడపిల్ల జననం ఒక సవాల్‌గా మారింది. ఆడపిల్ల అని తెలిస్తే

దిశ, హాలియా : ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుంటున్న నేటి సమాజంలో ఆడపిల్ల జననం ఒక సవాల్‌గా మారింది. ఆడపిల్ల అని తెలిస్తే గర్భంలోనే మట్టుపెడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు నామమాత్రపు తనిఖీలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హాలియా పట్టణంలో కొంతమంది వైద్యులు అమాయకపు తల్లిదండ్రుల ఆలోచనలను ఆసరాగా చేసుకుని గర్భస్థ శిశు పరీక్షలు (స్కానింగ్) నిర్వహించి ఏకంగా అబార్షన్లు చేస్తూ రూ.వేలల్లో దండుకుంటున్నారు. అబార్షన్లకు భార్యాభర్తలు అంగీకరిస్తే మాకేంటి అభ్యంతరం..? అంటూ కొందరు వైద్యులు గుట్టు చప్పుడు కాకుండా గర్భంలోనే శిశువులను చంపి వేస్తున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయి. హాలియా పట్టణంలోని సాగర్ రోడ్డులో గల ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గత వారం రోజుల కింద ఓ జంట గర్భస్థ శిశు పరీక్షలు చేయించుకొని డబ్బుల డిమాండ్‌లో తేడాలు రావడంతో గుట్టు బయటకు పొక్కిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. అయితే ఈ విషయం జిల్లా మాతా, శిశు ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం చేరగా నాలుగు రోజుల కింద సంబంధిత ఆస్పత్రుల్లో రికార్డులను తనిఖీ చేసి సమాచారం బయటకు పక్కకుండా మేనేజ్ చేసినట్లు తెలుస్తోంది.
హాలియా పట్టణంలో కలకలం..?
హాలియా పట్టణంలో కొంతమంది వైద్యులు అమాయకపు తల్లిదండ్రుల ఆలోచనలను ఆసరాగా చేసుకుని గర్భస్థ శిశు పరీక్షలు (స్కానింగ్) నిర్వహించి ఏకంగా అబార్షన్లు చేస్తూ రూ.వేలల్లో దండుకుంటున్నారు. అబార్షన్లకు భార్యాభర్తలు అంగీకరిస్తే మాకేంటి అభ్యంతరం..? అంటూ కొందరు వైద్యులు గుట్టు చప్పుడు కాకుండా గర్భంలోనే శిశువులను చంపి వేస్తున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయి. హాలియా పట్టణంలోని సాగర్ రోడ్డులో గల ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గత వారం రోజుల కింద ఓ జంట గర్భస్థ శిశు పరీక్షలు చేయించుకొని డబ్బుల డిమాండ్‌లో తేడాలు రావడంతో గుట్టు బయటకు పొక్కిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.
పట్టణంలోని కొంతమంది అర్హత లేని వైద్యులు సైతం నిత్యం డీఎంసీలు చేస్తూ అమాయకుల మహిళల ప్రాణాలను ఫణంగా పెడుతున్నట్టు గతంలో ఆరోపణలు వెళ్లు వెత్తాయి. అబార్షన్లకు వాడే అతి ప్రమాదకరమైన మందులను ఉపయోగిస్తూ గర్భస్థ మహిళ ప్రాణాలకు ముప్పు అయినప్పటికీ అవగాహన లేని వైద్యులు అబార్షన్ల చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది వైద్యులు ఇదే వ్యాపారంగా కృష్ణపట్టే ప్రాంతంలోని అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లు తెలుస్తుంది. పట్టణంలోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో స్కానింగ్ ద్వారా గర్భస్థ శిశు పరీక్షలు నిర్వహించి ఆడ శిశువు అయితే అబార్షన్లకు పాల్పడుతున్నట్లు సమాచారం.
ఎంసీహెచ్ అధికారుల తనిఖీలు..?
హాలియా పట్టణంలోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో జెండర్ ఐడెంటిటీ స్కానింగ్ చేస్తున్నారంటూ ఆ నోటా ఈ.. నోటా జిల్లా మాతా, శిశు ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం చేరింది. దీంతో సంబంధిత అధికారులు గత నాలుగు రోజుల కింద సంబంధిత ఆస్పత్రుల్లో రికార్డులను తనిఖీ చేసి సమాచారం బయటకు పక్కకుండా మేనేజ్ చేసినట్లు సమాచారం. రికార్డుల తనిఖీల్లో పలు ఆసక్తికర విషయాలు వెళ్లడైనట్టుగా సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సామాజికవేత్తలు కోరుతున్నారు.






