- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చైనా మాంజాను వాడితే కఠిన చర్యలు : ఎస్సై భాస్కర్ రెడ్డి
సంక్రాంతి పండగ సందర్భంగా పతంగులు ఎగరవేసేవారు ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజాను వాడితే కఠిన చర్యలు తప్పవని పోచంపల్లి ఎస్సై భాస్కర్ రెడ్డి అన్నారు.

దిశ,భూదాన్ పోచంపల్లి : సంక్రాంతి పండగ సందర్భంగా పతంగులు ఎగరవేసేవారు ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజాను వాడితే కఠిన చర్యలు తప్పవని పోచంపల్లి ఎస్సై భాస్కర్ రెడ్డి అన్నారు. శనివారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిషేధిత చైనా మాంజా వల్ల పశువులకు, పక్షులకు, మనుషులకు మాంజా దారం తగిలి ప్రాణాపాయం జరిగే ప్రమాదం పొంచి ఉందని, ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా పండగ సెలవుల్లో సొంత ఊర్లకు లేదా బయట ప్రాంతాలకు వెళ్లే వారు తమ ఇంట్లోని బంగారం, వెండి వంటి విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకుండా తమ వెంట తీసుకువెళ్లాలని సూచించారు. ఇళ్లకు తాళం వేసి వెళ్లేవారు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకునేందుకు మండల ప్రజలు సహకరించాలని కోరారు.






