మానవత్వం ఉన్న మంచి డాక్టర్ ఇక లేరు

by Bhanu |

గుడిలో బడిలో దవాఖానాలు అనేకమైన మౌలిక సదుపాయాలు కల్పించి మానవత్వం గల గొప్ప డాక్టర్ గా పేరొందిన డాక్టరు ఇక లేరు.

మానవత్వం ఉన్న మంచి డాక్టర్ ఇక లేరు
X

దిశ, మర్రిగూడ : గుడిలో బడిలో దవాఖానాలు అనేకమైన మౌలిక సదుపాయాలు కల్పించి మానవత్వం గల గొప్ప డాక్టర్ గా పేరొందిన డాక్టరు ఇక లేరు... ఆ మానవత్వం ఉన్న ఆ డాక్టరు గురించి తెలుసుకుందాం. మండలంలోని శివన్న గూడెం గ్రామానికి చెందిన చిన్న పిల్లల డాక్టర్ కుంభం ఇంద్రారెడ్డి అనారోగ్యంతో ఆదివారం ఉదయం మరణించాడు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీడియాట్రిస్టు చిన్నపిల్లల డాక్టర్ గా వైద్యని అభ్యసించి సంతోష్ నగర్ లో తక్కువ ఫీజుతో ఎంతోమందికి వైద్య సేవ చేశాడు.

మర్రిగూడ ప్రాంత వాసి అయిన ఆయన ఇక్కడి ప్రజలకు ఫీజు లేకుండానే వైద్య సేవలు అందించి రవాణా సదుపాయం కూడా కల్పించాడు. ఎవరైనా సహాయం కోరి తన గడప తట్టిన వెంటనే స్పందించి ఏ విధమైన సహకారమైనా చేసి అందరి మనలను పొందాడు దేవాలయాలకు పిల్లలు విద్యాభ్యాసానికి పాఠశాలలకు ఆసుపత్రులకు ప్రజలకు కావలసిన అన్ని రకాల సదుపాయాలు కల్పించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ముద్ర వేశాడు.

గ్రామాల్లో ప్రతి ఒక్కరికి భక్తి భావం ఉండాలని పూజారులకు సైతం తన సొంత ఖర్చుల తో వేతనం అందించాడు . మానవత్వం ఉన్న మంచి డాక్టర్ మరణించాడని తెలుసుకున్న ప్రజలు తండోపతండాలుగా వెళ్లి తమ తమ సంతాపం వ్యక్తం చేశారు.



Next Story