Huge Explosion : యాదాద్రి భువనగిరిలో పరిశ్రమలో భారీ పేలుడు

by Muthe.Rajitha |   (  Updated:2025-04-29 13:07:33  IST  )

యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

Huge Explosion : యాదాద్రి భువనగిరిలో పరిశ్రమలో భారీ పేలుడు
X

దిశ, వెబ్ డెస్క్ : యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో మంగళవారం మధ్యాహ్నం భారీ పేలుడు(Huge Explosion) సంభవించింది. మోటకొండూర్ మండలం కాటపల్లి(Katapalli)లో గల ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో ఒక్కసారిగా పేలుడు సంభవించగా.. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు అయినట్టు సమాచారం. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. భారీ పేలుడు దాటికి పరిశ్రమ భవనం కుప్పకూలి పోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పేలుడుకు గల కారణాలను విశ్లేసిస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story