రోడ్డు ప్రమాదంలో స్వర్ణకారుల సంఘం రాష్ట్ర నాయకులు మృతి

by Bhanu |

తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన బంగారం వ్యాపారి,స్వర్ణకారుల సంఘం రాష్ట్ర జనరల్ సెక్రెటరీ తంగళ్ళపల్లి మధు సత్యనారాయణ చారి శనివారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లి టోల్ ప్లాజా సమీపంలో రోడ్డు ప్రమాదంలో మరణించారు.

రోడ్డు ప్రమాదంలో స్వర్ణకారుల సంఘం రాష్ట్ర నాయకులు మృతి
X

దిశ, తిరుమలగిరి: తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన బంగారం వ్యాపారి,స్వర్ణకారుల సంఘం రాష్ట్ర జనరల్ సెక్రెటరీ తంగళ్ళపల్లి మధు సత్యనారాయణ చారి శనివారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లి టోల్ ప్లాజా సమీపంలో రోడ్డు ప్రమాదంలో మరణించారు. హైదరాబాదుకు తమ సమీప బంధువుల అంత్యక్రియలకు హాజరై వస్తుండగా స్కూటీపై వెళుతున్న మధు సత్యనారాయణ ద్విచక్ర వాహనం కారుకు వెనక నుండి ఢీకొట్టడంతో స్కూటీపై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

తిరుమలగిరి పట్టణ వ్యాప్తంగా ఆదివారం బంగారం జ్యువెలరీ దుకాణాలు బందు చేసి మండల స్వర్ణకారుల సంఘం ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ర్యాలీగా మృతదేహాన్ని తిరుమలగిరి చౌరస్తా నుండి మార్కెట్ యార్డ్ వరకు తీసుకువెళ్లారు.ఆయన మృతి స్వర్ణకారుల సంఘానికి తీరని లోటు అని మండల స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు మారోజు ఈశ్వరాచారి అన్నారు.మృతునికి భార్య ఇద్దరు కూతుళ్లు,ఒక కొడుకు ఉన్నారని బంధువులు తెలిపారు.

Next Story