చికిత్స పొందుతూ గీత కార్మికుడు మృతి

by Bhanu |

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం జనంపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు నోముల వంశీ గౌడ్ (25) చికిత్స పొందుతూ కన్నుమూశాడు.

చికిత్స పొందుతూ గీత కార్మికుడు మృతి
X

దిశ, రామన్నపేట : యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం జనంపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు నోముల వంశీ గౌడ్ (25) చికిత్స పొందుతూ కన్నుమూశాడు. మంగళవారం తాటి చెట్టు ఎక్కి కల్లు తీయుతుండగా అనుకోకుండా మోకుజారి చెట్టుపై నుంచి పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతడి తలకు తీవ్రగాయాలు కావడంతో వెంటనే రామన్నపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు.


అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఓమిని హాస్పిటల్‌కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం వంశీ గౌడ్ మృతి చెందాడు. తన వృత్తి నిర్వహణలోనే ప్రాణాలు కోల్పోయిన వంశీ గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story