- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో రెండేళ్లుగా కాపర్ చోరీ.. ముఠా అరెస్ట్
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో కాపర్ దొంగతనానికి పాల్పడిన ముఠా సభ్యులను మిర్యాలగూడ టూ టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. ...

దిశ, మిర్యాలగూడ: యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో కాపర్ దొంగతనానికి పాల్పడిన ముఠా సభ్యులను మిర్యాలగూడ టూ టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. నిందితులు దామరచర్ల మండలం వీర్లపాలెం యాదాద్రి పవర్ ప్లాంట్ బీహెచ్ఈఎల్ కంపెనీకి చెందిన కాపర్ వస్తువులను దొంగిలించి నిర్మానుష్య ప్రాంతంలో దాచి పెట్టేవారని, ఆ తర్వాత పాత ఇనుప సామాను వ్యాపారులకు అమ్మి సొమ్ము చేసుకునేవాళ్లని పోలీసులు తెలిపారు.
మిర్యాలగూడకు చెందిన మేకల శ్రీను, దామరచర్ల మండలం తాళ్ల వీరప్ప గూడెం గ్రామానికి చెందిన పిండం భాస్కర్, సాత్ తండా చెందిన గుగులోతు రఘు, దుబ్బ తండాకు చెందిన కొర్ర శివ, తాళ్లవీరప్పగూడెం గ్రామానికి చెందిన చెన్న బోయిన నాగయ్య, సాత్ తండకు చెందిన గుగులోతు రాముడు, మిర్యాలగూడ పట్టణానికి చెందిన బత్తుల జానకి రాములు, పగడాల బాలరాజులు ముఠా సభ్యులుగా ఏర్పడి దొంగతనానికి పాల్పడుతున్నట్లు తెలిపారు. ఈదలగూడ సమీపంలో నిందితులను పట్టుకున్నామని చెప్పారు. వారి వద్ద నుంచి రూ. 26 లక్షలు, రెండు మహేంద్ర క్యాంపర్ వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులపై వాడపల్లి, మిర్యాలగూడ టూ టౌన్, మిర్యాలగూడ వన్ టౌన్‌లలో కేసు నమోదు అయినట్లు తెలిపారు. నేరస్తులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టామని పోలీసులు స్పష్టం చేశారు.






