- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనారోగ్యంతో మాజీ ఎంపీటీసీ మృతి
by Ratna Kumari |
అనారోగ్యంతో మాజీ ఎంపీటీసీ మృతి చెందిన ఘటన మండల పరిధిలోని మంచతండాలో చోటు చేసుకుంది.

X
దిశ, తుంగతుర్తి : అనారోగ్యంతో మాజీ ఎంపీటీసీ మృతి చెందిన ఘటన మండల పరిధిలోని మంచతండాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచతండా గ్రామపంచాయతీకి చెందిన లకావత్ మాన్ సింగ్ నాయక్ (58) అనారోగ్యంఓ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే 1995-2000 వరకు ఆయన సీపీఐ(ఎం) తరపున ఉమ్మడి బండరామారం గ్రామం నుంచి ఎంపీటీసీగా విజయం సాధించారు. విభజన అనంతరం మొదటిసారిగా ఏర్పడిన మంచతండా గ్రామపంచాయతీకి ఆయన భార్య లకావత్ శారద తొలి సర్పంచ్ గా ఎన్నికయ్యారు. ముఖ్యంగా ఆయన చిన్నతనం నుంచే తండ్రి రాజకీయ వారసత్వాన్నిపుచ్చుకున్నారు. సీపీఎం పార్టీ ద్వారా ప్రారంభించిన రాజకీయ జీవితం తెలుగుదేశం, వైసీపీ, బీఆర్ఎస్ పార్టీల ద్వారా కొనసాగింది. ఆయన మృతి పట్ల మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్యతో పాటు పలువురు సంతాపాన్ని ప్రకటించారు.
Next Story






