ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలి

by Naveena |

ఓటర్ జాబితా ఎప్పటికప్పుడు తాజాగా ఉండేలా చేర్పులు మార్పులకు రాజకీయ పార్టీలు సహకరించాలని నల్గొండ రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీ అశోక్ రెడ్డి అన్నారు.

ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలి
X

దిశ,నల్లగొండ: ఓటర్ జాబితా ఎప్పటికప్పుడు తాజాగా ఉండేలా చేర్పులు మార్పులకు రాజకీయ పార్టీలు సహకరించాలని నల్గొండ రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీ అశోక్ రెడ్డి అన్నారు.ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆన్లైన్లో రోజువారి ఓటర్ నమోదు అవుతున్న ఫామ్ 6,7,8 ల పరిష్కారం,డూప్లికేట్ ఓటర్లు తొలగింపు,బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం తదితర రెవెన్యూ డివిజనల్ అధికారి నల్లగొండ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు నూతన ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. అదేవిధంగా అభ్యంతరాలు, ఓటర్ కాని విషయాలు చిరునామా మార్పు బదిలీలు చేసుకునే అవకాశం ఎన్నికల సంఘం నిరంతరం కలిపించిందన్నారు. ఎన్నికల ప్రక్రియ కాకుండా ఓటర్ జాబితా తయారీ ప్రక్షాళనలు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్లు నల్గొండ తిప్పర్తి డి ఏ ఓ నా యొక్క తహసిల్దార్ ఎలక్షన్, సీనియర్ నాయకులు ఎలక్షన్ మరియు ఎలక్షన్ సూపర్వైజర్లు మరియు రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story