- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
తాగునీరు అందించాలి
దిశ,రాజాపేట : మూడు రోజులుగా తాగునీటి సరఫరా లేకుండా తమను అనేక ఇబ్బందులు పెడుతూ అడిగితే ఆగ్రహిస్తూ కష్టాలపాలు చేస్తున్నారంటూ రాజాపేట మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన ప్రజలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం మహిళలు ఆగ్రహిస్తూ గ్రామపంచాయతీ కార్యదర్శి, సిబ్బంది తీరుపై తీవ్ర విమర్శలు చేస్తూ ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు వచ్చి కార్యాలయం ముందు ఖాళీ బిందెలను పెట్టి బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ కార్యదర్శి జ్యోతి, సిబ్బంది, ప్రత్యేక అధికారి సాయి చైతన్య నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అదే సమయంలో రోడ్డుపై బైఠాయించి ఖాళీ బిందెలతో నినాదాలు చేశారు. బస్సులను ఇతర వాహనాలను వెళ్లకుండా అడ్డుకున్నారు. నీటి సమస్య అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఉందని వారు ఆరోపించారు. నల్లాల ద్వారా వస్తున్న నీరు కూడా కలుషితంగా ఉందన్నారు.
దీంతో తాము రోగాల బారిన పడుతున్నామంటూ ఆరోపించారు. తమను మనుషులుగా చూడడం లేదని, సమస్యను చెప్పినా పట్టించుకోవడంలేదని, అదేమిటి అని ప్రశ్నిస్తే ఆగ్రహిస్తున్నారు అంటూ తీవ్రంగా స్పందించారు. ఈ విషయంపై గ్రామంలో అశాంతి వాతావరణం నెలకొంది. పరిస్థితుల విషయమించక ముందే రాబిట్ చర్యలు తీసుకోవాలంటూ కొందరు గ్రామస్తులు హెచ్చరించారు. గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి, కార్యదర్శిలు స్పందించి గ్రామంలో ఉన్న నీటి బోరును వాడకంలోకి తీసుకువచ్చేలా తాత్కాలికంగా పైపులను రిపేర్ చేశారు. దీంతో తాత్కాలికంగా సమస్య సద్దుమణిగింది.
గ్రామాన్ని సందర్శించిన ఆర్. డబ్ల్యూఎస్ డీఈఈ బృందం ఈ విషయం తెలిసిన వెంటనే ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ కరుణాకర్, ఎంపీఓ కిషన్, ప్రత్యేక అధికారి సాయి చైతన్య బృందం గ్రామాన్ని సందర్శించారు. పరిస్థితిపై సెక్రటరీ జ్యోతిని అడిగి తెలుసుకున్నారు. ఒకటిన్నర రోజులపాటు నీటి సరఫరా కాలేదని, గేట్ వాల్ రిపేర్ వల్ల ఈ ఇబ్బంది కలిగిందని జ్యోతి వివరించారు. కాలా గ్రామస్తులు మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీరు మురికిగా ఉంటుందని, స్నానాలు చేయడం వంట వండుకోవడం వల్ల జ్వరం, దురద అనారోగ్యం కలుగుతున్నాయని తెలిపారు. మిషన్ భగీరథ నీటిని శాంపిల్ సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపనున్నట్లు డీఈ కరుణాకర్ ప్రజలకు తెలిపారు. వర్షాలు పడుతున్న కారణంగా కొద్ది రోజులు ఎరుపు రంగులో నీరు వస్తుందని ప్రజలకు చెప్పారు. దీంతో గ్రామంలో తాత్కాలికంగా సమస్యకు తెరపడింది.
- Tags
- protest