- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ
ఎన్నికల విధులు నిర్వహించే పోలీసులు అప్రమత్తంగా ఉండి, ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. నేడు మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తున్న సందర్భంగా కట్టంగూరు, నకిరేకల్, నల్లగొండ మండలాల్లోని సమస్యాత్మక గ్రామాలను, పోలింగ్ స్టేషన్లను బుధవారం పరిశీలించారు.

దిశ, నల్లగొండ క్రైం: ఎన్నికల విధులు నిర్వహించే పోలీసులు అప్రమత్తంగా ఉండి, ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. నేడు మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తున్న సందర్భంగా కట్టంగూరు, నకిరేకల్, నల్లగొండ మండలాల్లోని సమస్యాత్మక గ్రామాలను, పోలింగ్ స్టేషన్లను బుధవారం పరిశీలించారు. అధికారులు, పోలీసులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, సూచనలు సలహాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 11వ తేదీ మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో, నిస్పక్షపాతంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పోలింగ్ రోజు పోలింగ్ స్టేషన్ల దగ్గర బీఎన్ఎస్ఎస్ 163 యాక్ట్ అమల్లో ఉంటుందని, పోలింగ్ కేంద్రాల 100 మీటర్ల లోపల ఎవ్వరినీ రానివ్వొద్దని, ఓటు హక్కు వినియోగించుకోనే వారు పోలింగ్ కేంద్రాలకు ఎట్టి పరిస్థితిలో సెల్ ఫోన్లు, ఇంక్ బాటిల్స్, ఇతర హాని కలిగించే వస్తువులు తీసుకురాకుండా జాగ్రత్తగా తనిఖీ చేయాలని సూచించారు. ఏదైనా సమస్య వస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని అన్నారు. ఎన్నికల రోజు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మొబైల్ రూట్ లలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే క్షణాలలో రూట్ మొబైల్ టీమ్ లు అక్కడకు చేరుకొని, సమస్యను పరిష్కరించగలగాలని, అందుకు లోకల్ ఎస్సై, రూట్ మొబైల్ ఇంచార్జి అధికారి కమ్యూనికేషన్లో ఉంటూ కో-ఆర్డినేషన్ చేసుకోవాలని తెలిపారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కేసులు
నల్లగొండ రూరల్ పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రమైన అప్పాజీ పేట గ్రామాన్ని ఆయన సందర్శించారు. మొదటి విడతలో భాగంగా 318 గ్రామ పంచాయతీలలో 466 పోలింగ్ కేంద్రాలు, 2870 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రతి మండలానికి సూమరు 150చొప్పున 2వేల మంది పోలీస్ సిబ్బందితో రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేసి, పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. క్రిటికల్ పోలింగ్ గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహించి, ఎన్నికలపై ప్రజల్లో భరోసా కల్పించామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 1141 మంది రౌడీషీటర్స్, త్రిపుల్ మంగ్లర్స్‌కు కౌన్సెలింగ్, ఇచ్చి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చామని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా, గొడవలు, అల్లర్లు సృష్టించినా కఠిన చర్యలు తీసుకుంటామని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు.






