- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్
మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి కుటుంబ సమేతంగా జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ దర్శించుకున్నారు.

దిశ, మఠంపల్లి: మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి కుటుంబ సమేతంగా జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆలయ ధర్మకర్తలు దేవాలయ చైర్మన్ ఈవోలు జిల్లా కలెక్టర్ ను వారి కుటుంబ సభ్యులను స్వాగతం పలికారు. లక్ష్మీ నరసింహ స్వామి వారిని కలెక్టర్ కుటుంబ సమేతంగా తేజస్ దర్శించుకున్న తర్వాత వేదమంత్రాలతో దేవాలయ అర్చకులు ఆశీర్వచనం చేసి, శేష వస్త్రాలు ఇచ్చి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా దేవాలయ పూజారులు ఫణి భూషణచార్యులు, పద్మనాభచార్యులు దేవాలయం విశిష్టత, చరిత్రను ఇక్కడ జరిగే పండుగలను, పూజలను, దేవాలయం విశిష్టతను, కలెక్టర్ కుటుంబ సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కృష్ణానది ఒడ్డున శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం చాలా బాగుందని ఆహ్లాద వాతావరణంలో కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ విజయ్ కుమార్, మట్టపల్లి రావు , ఆర్డీఓ శ్రీనివాసులు, సిఐ చరమందరాజు, ఆలయ ఈవో సిరికొండ నవీన్ కుమార్, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.






