- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Disha Effect: ఆర్ఐ, సెక్షన్ ఆఫీసర్లకు మెమో..
తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలపై "ఆ కార్యాలయంలో అన్నీ ఆర్జిత సేవలే.. " అనే శీర్షికతో గురువారం 'దిశ' ప్రచురించిన కథనం మండలంలో ప్రకంపనలు సృష్టించింది.

X
దిశ, నడిగూడెం: తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలపై "ఆ కార్యాలయంలో అన్నీ ఆర్జిత సేవలే.. " అనే శీర్షికతో గురువారం 'దిశ' ప్రచురించిన కథనం మండలంలో ప్రకంపనలు సృష్టించింది. కథనానికి స్పందించిన తహసీల్దార్ తమ కార్యాలయంలో పని చేస్తున్న ముగ్గురు ఉద్యోగులకు మెమో జారీ చేసినట్లు తెలిసింది. మెమో జారీ అయిన వారిలో ఇద్దరు సెక్షన్ ఉద్యోగులు కాగా మరొకరు రెవెన్యూ ఇన్ స్పెక్టర్ ఉన్నారు. ఆర్.ఐ సెలవులో ఉండటంతో ఆయనకు మెమో అందలేదని సమాచారం. తమ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే సామాన్య ప్రజానీకం.. కొందరు ఉద్యోగుల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలు, వాస్తవాలను వెలికితీయడంలో 'దిశ' ఎప్పుడూ ముందు నిలుస్తుందని మండలవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






