చేనేత మిత్ర యాప్ ద్వారా నేరుగా చేనేత కార్మికుడికి బహుళలబ్ది

by Disha Web Desk 23 |
చేనేత మిత్ర యాప్ ద్వారా నేరుగా చేనేత కార్మికుడికి బహుళలబ్ది
X

దిశ భూదాన్ పోచంపల్లి: ప్రతి చేనేత కార్మికుడుకి ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే లబ్ధి, ఏలాంటి అవకతవకలు లేకుండాప్రతి చేనేత కార్మికుడుకి ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే లబ్ధి, ఏలాంటి అవకతవకలు లేకుండా అక్రమాలకు చెక్ పెడుతూ నేరుగా కార్మికుల బ్యాంక్ అకౌంట్ లోకి జమ అయ్యే విధంగా రూపొందించిన అద్భుతమైన యాప్ చేనేత మిత్ర అని జిల్లా చేనేత జౌళీ సహాయ సంచాలకులు విద్యాసాగర్ అన్నారు.సోమవారం పట్టణంలో జియో ట్యాగ్ ద్వారా గుర్తించిన ఇంటింటి చెనేత కార్మికుల మగ్గాలను ఆయన పరిశీలించి,వివరాలను సేకరించి చేనెత మిత్ర యాప్ లో అప్ లోడ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 6800 చేనేత మగ్గాలను గుర్తించమని, పోచంపల్లి మండల వ్యాప్తంగా 2200 చేనేత మాగ్గాలను గుర్తించామన్నారు. జియో ట్యాగ్ ద్వారా ఐడెంటిఫై చేసిన ప్రతి చేనేత కుటుంబం దగ్గరికి వెళ్లి వార్పూతో ఉన్న మగ్గంతో పాటు కార్మికుడి ఫోటో ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ వివరాలు చేనేత మిత్ర యాప్ లను పొందుపరచడం జరుగుతుందని చెప్పారు.మగ్గం నేసే ప్రతి ఒక్కరు సొంతంగా తమ తమ సెల్ ఫోన్లలో ఈ చేనేత మిత్ర యాప్ లో తమ స్థానికంగా ఉన్న మగ్గం తో పాటు ఈ వివరాలన్నీ ఎవరికి వారే యాప్ లో అప్ లోడ్ చేసేందుకు వీలుగా ప్రభుత్వం యాప్ రూపొందించిందని ఎలాంటి అవకతవకలకు అవకాశం లేదని వారన్నారు. ముఖ్యంగా మగ్గం ఒకచోట ఉండి కార్మికులు మరోచోట ఉండి ఫోటోలు గాని ఇతర ఆధార్ బ్యాంకు వివరాలను అప్ లోడ్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఈ యాప్ వివరాలను స్వీకరించదని హెచ్చరించారు. మగ్గం ఉన్న చోటు నుంచి మాత్రమే మగ్గంతో ఫోటోని,వారి ఆధార్ కార్డు,బ్యాంక్ అకౌంట్ వివరాలు నేరుగా వివరాలను ఎంట్రీ చేస్తేనే చేనేత మిత్ర యాప్ అంగీకరిస్తుంది తెలిపారు.

ఎన్ రోల్ కార్యక్రమం ఈ నెల చివరి దాకా పట్టణం వ్యాప్తంగా కొనసాగుతుందనీ, ముందుగా గుర్తించిన చేనేత కార్మికులు తప్పకుండా వారి వివరాలను ఈ ఎన్ రోల్ చేసుకోవాలని ఆయన కోరారు.దశల వారీగా అన్ని గ్రామాలలో ఎన్ రోల్ మెంట్ చేస్తామని ఆయన తెలిపారు.చేనేత మిత్ర యాప్ లో ఎన్ రోల్ చేసుకున్న ప్రతి చేనేత కార్మికుడికి ప్రభుత్వం ద్వారా వచ్చే వివిధ రకాల పథకాల లబ్ధి నేరుగా వారి బ్యాంకు అకౌంట్ లోకి వచ్చి జమ అవుతాయని వారన్నారు. చేనేత సబ్సిడీ, చేనేత బీమా, త్రీప్ట్ ఫండ్, ఇంకా ఎలాంటి ప్రభుత్వ బెనిఫిట్ అయినా సరే యాప్ లో ఎన్ రోల్ చేసుకున్న వారికే అందుతుందని తెలిపారు. చేనేత మగ్గం యజమాని దగ్గర వారి కుటుంబ సభ్యులు కాననీ బంధువులు కానీ ఇతరులు కానీ మగ్గాలు నేస్తే వారికి అనుబంధ కార్మికులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. దీంతో ఎక్కడ పడితే అక్కడ వేరే ప్రాంత కార్మికులను తప్పు లెక్కలు చూపించడానికి వీలుండదనీ, ఒకసారి మాత్రమే ఈ కార్డు ఇస్తారని తెలిపారు.

అనుబంధ కార్మికుడిగా గుర్తింపు కార్డు ఉన్నవారికి మాత్రమే ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరుతుందని మళ్లీ మళ్లీ గుర్తు చేశారు. అనివార్య కారణాలవల్ల ఈ యాప్ లో ఎన్ రోల్ చేసుకోని వారు ఎవరైనా ఉంటే వారిని గుర్తించి తిరిగి మరొక్కసారి వారి వివరాలను చేనేత మిత్ర యాప్ లో నమోదు చేస్తామని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.ప్రతి నెల మగ్గం మీద వార్పుతో ఉండే ఫోటోను ఈ యాప్ లో ప్రతి కార్మికుడు అప్లోడ్ చేస్తేనే వారు మగ్గం లైవ్ ఉన్నట్టుగా గుర్తిస్తుందనీ అలా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చిన వారే అన్ని పథకాలకు అర్హులని గుర్తు చేశారు. సొంతంగా యాప్ లో వివరాలను నమోదు చేసిన అంగీకరించిన తర్వాత కార్మికుల వివరాలను , మగ్గం ఫోటో సహా యాప్ ని ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చనీ తెలిపారు. కార్మికుడు వేరే ప్రాంతంలో ఉండి ఫోటోలు కార్మికుడి వివరాలను నమోదు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో యాప్ స్వీకరించదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ మేనేజర్ రుద్ర ఆంజనేయులు మాజీ చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు మంగళంపల్లి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed