సముద్రంలోతులో మహిళ చేయిపట్టుకుని అద్భుతాన్ని చూపించిన ఆక్టోపస్..

by Sumithra |
సముద్రంలోతులో మహిళ చేయిపట్టుకుని అద్భుతాన్ని చూపించిన ఆక్టోపస్..
X

దిశ, ఫీచర్స్ : సముద్రపు లోతుల్లో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. వాటి గురించి కొన్నిసార్లు మానవులకు కూడా తెలియదు. వందల సంవత్సరాల క్రితం నిధులతో నిండిన ఓడలు నీటిలో మునిగిపోయి ఉన్నాయి. అయితే చాలా సార్లు ఇలాంటి నిధులు తెలిసో, తెలియకో కనుగొంటూ ఉంటారు. ఒక మహిళా డైవర్ విషయంలో కూడా అలాంటిదే జరిగింది. ఆమె వేరే పని కోసం సముద్రంలోకి వెళ్ళింది. కానీ ఆమెకు తెలియకుండానే ఆమె ఒక విషయాన్ని కనుగొంది. కానీ ఈ విషయంలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆమెతో పాటు ఒక వింత సముద్ర జీవిగా పరిగణించే ఆక్టోపస్ తనకు సాయం చేసింది.

ఆస్ట్రేలియా నివాసి జూల్స్ కేసీ చేయిని ఒక 'తెలివైన' ఆక్టోపస్ పట్టుకుని సముద్రంలో ఉన్న ఓ చోటికి తీసుకువెల్లింది. ఆక్టోపస్ తన చేతిని నీటి అడుగున పట్టుకోవడానికి పదేపదే ప్రయత్నిస్తోందని, తెలియని మార్గంలో నడవమని ఆమెను అడుగుతుండడాన్ని జూల్స్ నమ్మలేకపోయింది. LadBible నివేదిక ప్రకారం ఒక అవార్డు గెలుచుకున్న ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో ఆ అద్భుతమైన క్షణాన్ని బంధించాడు. అది కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఆక్టోపస్ చేయి పట్టుకుని..

ఈ విషయం పై జూల్స్ మాట్లాడుతూ ఆక్టోపస్ తనను ఎక్కడికి తీసుకెళ్తోందో తనకు తెలియదని, అయితే తాను ఏదో సాహసం చేస్తున్నట్టుగా తనకు ఖచ్చితంగా అనిపించిందని జూల్స్ చెప్పారు. ముందుగా ఆక్టోపస్ తన దగ్గరికి వచ్చి, తన చేయి పట్టుకుని, తనను వెంట రమ్మని కోరిందని తెలిపారు. అప్పుడు తాను కూడా దానితో కలిసి నడవడం మొదలుపెట్టిందని చెప్పారు. ఈ లోగా అక్కటోపస్ తాను తనతో వెలుతున్నానా లేదా అని వెనక్కి తిరిగి చూసిందట. తాను అక్టోపస్ ని అనుసరిస్తున్నానని నిర్ధారించుకున్నాక, మళ్ళీ ముందుకు సాగడం ప్రారంభించింది.

ఉక్కు స్తంభాలకు సమాధి..

ఆక్టోపస్ రెండు ఉక్కు స్తంభాల మధ్య కట్టి ఉన్న సమాధి వద్దకు తీసుకెళ్లినప్పుడు ఆమెకు పెద్ద షాక్ తగిలిందని జూల్స్ చెప్పారు. ఆ సమాధి రాయి పై ఒక చిన్న తెల్ల కుక్కను పట్టుకున్న వ్యక్తి చిత్రం ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సమాధిని చూపించిన తర్వాత ఆక్టోపస్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ సమాధిలో చుట్టుపక్కల ఏ నిధి దాగి ఉందో జూల్స్ వెల్లడించనప్పటికీ ఆక్టోపస్ వారి చేయి పట్టుకుని ఆ సమాధికి తీసుకెళ్లడం నిజంగా ఒక అద్భుతం కంటే తక్కువ కాదు అని తెలిపింది.

Next Story