ఈ నెల 9న సీపీఎం ప్రజా సదస్సు

by velandi.Saikiran |

ఈ నెల 9న తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా జరిగే ప్రజా సదస్సు జయప్రదం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

ఈ నెల 9న సీపీఎం ప్రజా సదస్సు
X

దిశ, చౌటుప్పల్ టౌన్: ఈ నెల 9న తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా జరిగే ప్రజా సదస్సు జయప్రదం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి. జాహంగీర్ పిలుపునిచ్చారు. చౌటుప్పల్ మండల కేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో ఆదివారం ఆ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జహంగీర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఈనెల 9న తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా భువనగిరి లో ప్రజా సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసమే ప్రజా సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యకమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బూర్గు కృష్ణారెడ్డి, మండల కార్యదర్శి గంగాదేవి సైదులు, జిల్లా కమిటీ సభ్యులు రాగీరు కిష్టయ్య, చింతల సుదర్శన్, బోయ యాదయ్య, పొట్ట శీను, బోదాస్ వెంకటేశం, జక్కిడి దేవేందర్ రెడ్డి, మీసాల శీను, ఎలమల సంజీవ, చెరుకు లక్ష్మమ్మ, శ కొంతం శ్రీనివాస్ రెడ్డి, జక్కిడి రమణారెడ్డి, గుండ్ల మహేష్, రత్నం శ్రీకాంత్, నేరేడు మహేష్, బాలగోని బాలరాజు, జంగయ్య, పలసం శంకరయ్య, కంచర్ల రాజు, బాలం నరేష్, ఎల్లయ్య, శంకరయ్య, బాలరాజు, పెంటా రెడ్డి, అంజయ్య, జక్కిడి బాల్ రెడ్డి, బద్దం అంజయ్య, శేఖర్, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story