కోదాడ‌లో బీఆర్ఎస్ నాయ‌కుల ఆందోళ‌న

by Ratna Kumari |

సూర్యాపేట జిల్లా కోదాడ లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల విత్ డ్రా సందర్భంగా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

కోదాడ‌లో బీఆర్ఎస్ నాయ‌కుల ఆందోళ‌న
X

దిశ‌, కోదాడ : సూర్యాపేట జిల్లా కోదాడ లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల విత్ డ్రా సందర్భంగా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 11 వ వార్డు కొమరబండకు చెందిన తమ పార్టీ అభ్యర్థి దొడ్డిగర్ల గీత, పార్టీ నాయకుడు ప్రసాద్ ను కాంగ్రెస్ పార్టీ కి చెందిన వారు కిడ్నాప్ చేసి, బెదిరింపులకు పాల్పడి నామినేషన్ విత్ డ్రా చేయించారని ఆరోపిస్తూ ఆ వార్డుకు చెందిన ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు కొమరబండ లోని జాతీయ రహదారి పై ధర్నా కు దిగారు. మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో పలువురు బీఆర్ ఎస్ నాయకులు కోదాడ రూరల్ పోలీసు స్టేషన్ కు వెళ్లి తమ పార్టీ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ కి చెందిన వారు కిడ్నాప్ చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని, తమ పార్టీ అభ్యర్థిని సురక్షితంగా తీసుకురావాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అక్రమ పద్ధతుల్లో మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. తమ పార్టీ అభ్యర్థిని కిడ్నాప్ చేసి బలవంతంగా విత్ డ్రా చేయించడం ప్రజాస్వామ్యానికి విఘాతం అన్నారు. తమ పార్టీ అభ్యర్థికి ఏదైనా జరిగితే అందుకు కాంగ్రెస్ నాయకులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

Next Story