దేవరకొండ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే ధ్యేయం : ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

by Nallavelli.Anjaneyulu |

దేవరకొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమని, ముఖ్యంగా రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు.

దేవరకొండ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే ధ్యేయం : ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
X

దిశ, దేవరకొండ టౌన్ : దేవరకొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమని, ముఖ్యంగా రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. సోమవారం దేవరకొండ పట్టణంలోని 11వ వార్డు శేరిపల్లి రోడ్డులో రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ నిధులు 10 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 10,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల నూతన వ్యవసాయ గోదాం పనులకు రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వర్ రావు తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు పండించిన పంటను భద్రపరుచుకోవడానికి ఈ గోదాం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. నాణ్యతతో, నిర్ణీత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. SLBC ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి, దేవరకొండ నియోజకవర్గంలోని 50వేల‌ ఎకరాలకు సాగు నీరు అందిస్తామని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతి సెంటు భూమికి నీరు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

Next Story