- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో టీవీ సీరియల్ నడుపుతున్న సీఎం రేవంత్ రెడ్డి : ఎంపీ డాక్టర్ లక్ష్మణ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం టీవీ సీరియల్ మాదిరిగా కొండను తోవ్వి ఎలుక పట్టినట్లు వ్యవరిస్తున్నారని, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో అధికారులను బలి పశువులను చేస్తున్నారన్నారని రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు.

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం టీవీ సీరియల్ మాదిరిగా కొండను తోవ్వి ఎలుక పట్టినట్లు వ్యవరిస్తున్నారని, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో అధికారులను బలి పశువులను చేస్తున్నారన్నారని రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం భువనగిరిలో మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన హామీలను ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు డ్రామా ఆడుతున్నాయని విమర్శించారు. రేవంత్ రెడ్డి కాళేశ్వరంతో సహా ఏ కేసులో ఏ నాయకులను బాధ్యులను చేయలేదన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో బిఆర్ఎస్ తో పొత్తు లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ప్రజలు విసిగిపోయి మార్పులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో బిజెపి పార్టీ దే అధికారం అని అన్నారు. ప్రధానమంత్రి పిలుపుమేరకు గ్రామీణ ప్రాంతాల్లో యువత నైపుణ్యాన్ని బయట తీసేందుకు భువనగిరి పార్లమెంట్ పరిధిలో క్రీడా మహోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. యువత సరైన దృక్పథం లేక చెడు అలవాట్లకు బానిసలుగా మారుతున్నారన్నారు. యువత క్రీడల్లో నిమగ్నమై ఉంటే చెడు అలవాట్లకు దూరంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ ఉన్నారు.






