సూర్యాపేట జిల్లా కావడమే ఒక చరిత్ర: Cm Kcr

by Disha Web Desk 16 |
సూర్యాపేట జిల్లా కావడమే ఒక చరిత్ర: Cm Kcr
X

దిశ, వెబ్ డెస్క్: సూర్యాపేటలో రూ. 100 కోట్లతో ఈ రోజు చక్కటి అధికార భవనాలు నిర్మించుకున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. సూర్యాపేటలో కలెక్టరేట్ భవనాలను ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కావడమే ఒక చరిత్ర అని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అద్బుతమైన పని తీరు కనబర్చామని చెప్పారు. తలసరి ఆదాయంలో ఇండియాలోనే తెలంగాణ నెంబర్ వన్ స్టేట్ అని తెలిపారు. తలసరి విద్యుత్ వినియోగంలోనే రాష్ట్రం మరో ప్రగతికి గీటు రాయి అని కొనియాడారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉద్యోగులకు ఈ కీర్తి దక్కతుందన్నారు. జట్టు కట్టి పని చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో చూపించామన్నారు. ఇంకా చాలా రకమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవాల్సి అవసరం ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

‘నేడు తెలంగాణలో ఆకలి లేదు. పస్తులు ఉండే పరిస్థితి లేదు. ఆత్మహత్యలు లేవు. గతంలో ఆకలి ఉండేవి. అప్పట్లో జరిగిన కొన్ని ఘటనలను గుర్తు చేసుకుంటే కళ్ల వెంట నీళ్లొస్తున్నాయి. కానీ ఇప్పుడు అన్నీ అధిగమించాం. మిషన్ భగీరథతో పట్టుబట్టి నీళ్లు తీసుకొచ్చాం. ఇప్పుడు చాలా గర్వంగా ఉంది.’ అని కేసీఆర్ తెలిపారు.

Next Story

Most Viewed