- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలి: సీఐ నాగేశ్వర్ రావు
ఎన్నికల నియమావళి అమలు సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు అన్నారు. నాగారం సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో నాగారం మండలం వర్ధమానుకోట గ్రామంలో పోలీసుల కవాతు నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు ఈ కవాతు నిర్వహించామన్నారు.

దిశ, నాగారం: ఎన్నికల నియమావళి అమలు సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు అన్నారు. నాగారం సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో నాగారం మండలం వర్ధమానుకోట గ్రామంలో పోలీసుల కవాతు నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు ఈ కవాతు నిర్వహించామన్నారు. పౌరులు వారి ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవడం కోసం పోలీస్ శాఖ అనుక్షణం కృషి చేస్తుందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఎవరు కూడా తగాదాలు పెట్టుకోవద్దని సూచించారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోకూడదని హెచ్చరించారు. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని, డీజేలు, బాణాసంచా ఉపయోగించకూడదని సీఐ కోరారు. ఎన్నికల రోజున ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో నాగారం సర్కిల్ ఎస్సైలు చిరంజీవి, సైదులు, వెంకట్ రెడ్డి, నాగారం సర్కిల్ సిబ్బంది ఉన్నారు.






