- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిట్టీల పేరుతో మోసం.. నలుగురు అరెస్ట్
మిర్యాలగూడలో చిట్టీల పేరుతో మోసాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను టూ టౌన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.

దిశ, మిర్యాలగూడ : మిర్యాలగూడలో చిట్టీల పేరుతో మోసాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను టూ టౌన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మిర్యాలగూడ సీఐ సోమ నరసయ్య అందించిన వివరాల ప్రకారం.. పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన సైదిరెడ్డి, కటికం వెంకటరెడ్డి, ముత్తిరెడ్డికుంటకు చెందిన మామిళ్ళ వెంకన్న, రాంనగర్‌కు చెందిన గుణగంటి జానయ్యలు గత కొంతకాలంగా చిట్టీల పేరుతో పలువురు నుండి డబ్బు వసూలు చేస్తూ మోసం చేశారు.
ఇంట్రెస్ట్ ఎక్కువగా ఇస్తామని ఆశ చూపి, 42 మంది బాధితుల నుండి సుమారు రూ.1.50 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితులు అడగగానే తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పినప్పుడు, నిందితులు బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుల వద్ద నుంచి 46 చిట్టి పుస్తకాలు, 50 ప్రాంసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఐలు రాంబాబు, హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.






