రూ.12 కోట్ల భూమికి కన్నం వేసిన చౌటుప్ప‌ల్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు

by Ratna Kumari |

దిశ, చౌటుప్పల్ : నకిలీ పత్రాలు సృష్టించి 12 కోట్ల రూపాయల విలువైన మూడు ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్న సంఘటనలో బిఆర్ఎస్ చౌటుప్పల్ మండల పార్టీ అధ్యక్షుడు గిరికటి నిరంజన్ గౌడ్ పోలీసులు అరెస్టు చేశారు.

రూ.12 కోట్ల భూమికి కన్నం వేసిన చౌటుప్ప‌ల్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు
X

దిశ, చౌటుప్పల్ : నకిలీ పత్రాలు సృష్టించి రూ.12 కోట్ల విలువైన మూడు ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్న సంఘటనలో బీఆర్ఎస్ చౌటుప్పల్ మండల పార్టీ అధ్యక్షుడు గిరికటి నిరంజన్ గౌడ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామంలో చోటు చేసుకుంది. బుధవారం చౌటుప్పల్ సిఐ మన్మధకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 42 లో మూడు ఎకరాల ఐదుగుంటల భూమిని బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు నిరంజన్ గౌడ్ తప్పుడు పత్రాలు సృష్టించి తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకున్నారని మల్కాపురం గ్రామానికి చెందిన పక్కీర్ ప్రభాకర్ రెడ్డి కలెక్టర్ హనుమంతరావుకు ఇటీవల ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆర్డిఓ ను విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించారు. ఎమ్మార్వో వీరాబాయి సమక్షంలో విచారణ చేయగా భూమి అసలు యజమాని తెల్లపాటి భూపేష్ నుండి అప్పటి ఎమ్మార్వో భోగినేని మోహన్ రావు అనే వ్యక్తికి సాదాబైనామ ద్వారా 1994 లో అమ్మినట్లు రికార్డులో నమోదు చేశారు.


రికార్డును ఆధారం చేసుకుని 2007లో 13-బి సర్టిఫికెట్ ను తహసిల్దార్ యాదిరెడ్డి జారీ చేసినట్లు కూడా మరో పత్రాన్ని సృష్టించారు. దీని ఆధారంగా 2019లో అప్పటి తహసిల్దార్ రవీంద్రసాగర్ రికార్డుల సవరణ కోసం ప్రోసిడింగ్ జారీ చేసినట్లు పత్రాన్ని సృష్టించారు. వీటి ఆధారంగా 2022 సంవత్సరంలో చౌటుప్పల్ తహసిల్దార్ లో ఓ నివేదికను తయారుచేసి మోహన్ రావుకు భూమి రిజిస్ట్రేషన్ చేసేలా జిల్లా కలెక్టర్ కు ప్రతిపాదనలు పంపారు. దీంతో అప్పటి జిల్లా కలెక్టర్ నూతన పట్టా పాసు బుక్ ను మోహన్ రావుకు జారీ చేశారు. అనంతరం మోహన్ రావు నుండి గిరికటి నిరంజన్ గౌడ్, తన బినామీల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఎమ్మార్వో విచారణలో 2019లో ఎంట్రీలకు సంబంధించి అసలు రికార్డు లు లేవని, అప్పటి ఎమ్మార్వో ను విచారించగా తాను ఎలాంటి ప్రోసిడింగ్స్ జారీ చేయలేదని తెలిపారు. అప్పట్లో పని చేసిన వీఆర్వో, ఆర్ ఐ లను కూడా సంప్రదించగా తమ పేర్లతో ఎటువంటి నివేదికలు జారీ చేయలేదని వారు తెలిపారు. నిందితుడు నిరంజన్ గౌడ్ నకిలీ పత్రాలను ప్రొసీడింగ్స్ గా సృష్టించి భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తేలడంతో నిరంజన్ గౌడ్ పై, అప్పట్లో ఆర్ ఐ గా పని చేసిన ఉప్పు రాజేష్, బోగినేని మోహన్ రావు, అత్తాపురం నరేందర్ రెడ్డి ల పై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు సీఐ తెలిపారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నిరంజన్ గౌడ్ అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా అక్రమ కేసులు పెట్టి బిఆర్ఎస్ నాయకులను వేధిస్తుందని వారు ఆరోపించారు.

Next Story