చాకలి ఐలమ్మ శిలాఫలకం ధ్వంసం..

by Disha Web Desk 11 |
చాకలి ఐలమ్మ శిలాఫలకం ధ్వంసం..
X

దిశ, తుంగతుర్తి: వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహ శిలాఫలకాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన సంఘటన తుంగతుర్తి మండలం వెంపటి గ్రామంలో గురువారం వెలుగు చూసింది. ఈ మేరకు దీనిపై ఆ సంఘం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసి దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దాదాపు 5 సంవత్సరాల క్రితం వెంపటి గ్రామ బస్టాండ్ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహాన్ని రజక సంఘం ఏర్పాటు చేసి ప్రముఖులతో లాంఛనంగా ప్రారంభించారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వేళలో శిలాఫలకాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. గురువారం గ్రామానికి చెందిన బాపూజీ రజక సంఘం సంఘటనను గుర్తించింది. పరిస్థితులపై ఆరా తీసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

ఇదిలా ఉంటే గత రెండేళ్ల క్రితం కూడా ఐలమ్మ విగ్రహా కాళ్ళను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి విరగొట్టారు. ఈ మేరకు సంఘం నాయకులు మరమ్మత్తులు చేసి అతికించారు. తిరిగి నేడు శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంఘం అధ్యక్షుడు ఐతరాజు అంజయ్య, నాయకులు భువనగిరి లక్ష్మీనారాయణ, ముత్తయ్య, కొమురయ్య, బుచ్చి రాములు తదితరులు కలిసి తుంగతుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Next Story

Most Viewed