ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి ఆలయంలో కులవివక్ష..?

by Mahesh |
ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి ఆలయంలో కులవివక్ష..?
X

దిశ, కోదాడ: కోదాడ మండల పరిధిలోని ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి ఆలయం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన సంగతి విధితమే. ఆలయానికి వస్తున్న వేలాదిమంది భక్తులతో ఆలయం ప్రత్యేక గుర్తింపు పొందింది ఆలయానికి కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆలయానికి వస్తున్న భక్తుల తాకిడితో ఆలయ పరిసరాల్లో ఉన్న వ్యవసాయ భూములకు కోట్ల రూపాయల డిమాండ్ వచ్చింది. ఈ నేపథ్యం పై ఆలయం పై పెత్తనానికి ఆ గ్రామ ఉన్నత కులాలు బలహీన వర్గాలు పోటీ పడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆలయ కమిటీలో కేవలం ఉన్నత వర్గాలే ఉండాలని మేము కూడా ఉంటామని బలహీన వర్గాలు విభేదాలకు తలెత్తుతున్నాయి. ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు బలహీన వర్గాలకు చెందిన పండు స్వామి ఆలయ కమిటీ చైర్మన్ కు మేము స్వామివారికి పట్టు వస్త్రాలు తెస్తామని ఫోన్ చేసి అడిగారు.

కమిటీ సభ్యులకు అడిగి చెప్తానని చెప్పిన ఆలయ చైర్మన్ ఫోన్ కట్ చేయకుండా అక్కడ ఉన్న వ్యక్తులతో మాదిగ కులానికి చెందిన వారు స్వామివారికి పట్టు వస్త్రాలు ఎలా తేస్తారని చర్చిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఆడియోలో చైర్మన్ పక్కాగా కులం పేరుతో చర్చిస్తున్న మాటలు వినిపిస్తున్నాయి. భక్తులు ఎంతో విశ్వాసంగా కొలుస్తున్న దేవుని వద్ద కుల రాజకీయాలు తెరపైకి వస్తుండడం చర్చనీయాంశంగా మారింది. భక్తి కోసమా దేవునికి వస్తున్న ఆదాయం మింగడం కోసమా ఈ కుల ఆధిపత్య పోరులు జరుగుతున్నాయని జనం చర్చించుకుంటున్నారు. ఈ విషయంలో నియోజకవర్గ పెద్దలు కలగజేసుకొని వివాదాలకు తరలించకపోతే భక్తుల్లో ఆలయం పై విశ్వాసం తగ్గడమే కాక ఆలయ చరిత్రకు బంగారం కలగక తప్పదని పలువురు భావిస్తున్నారు.

Next Story