తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఉన్న వారికి గిఫ్ట్ డీడ్ రద్దు: కలెక్టర్ హనుమంత రావు

by Ratna Kumari |   (  Updated:2025-11-21 16:14:31  IST  )

దిశ, వలిగొండ : మండలంలోని అరూర్ గ్రామానికి చెందిన సీనియర్ సిటిజన్ కందాడి జనార్దన్ రెడ్డి (80 )సంవత్సరాలు అనే వ్యక్తి 2024 సంవత్సరం లో తన కుమారుడుకి 18 ఎకరాల 16

తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఉన్న వారికి గిఫ్ట్ డీడ్ రద్దు:   కలెక్టర్ హనుమంత రావు
X

దిశ, వలిగొండ : మండలంలోని అరూర్ గ్రామానికి చెందిన సీనియర్ సిటిజన్ కందాడి జనార్దన్ రెడ్డి (80 )అనే వ్యక్తి 2024 సంవత్సరం లో తన కుమారుడుకి 18 ఎకరాల 16 గుంటల భూమిని దాన పూర్వకంగా గిఫ్ట్ డీడ్ ఇవ్వడం జరిగింది. కానీ తనను చూడ‌టం లేద‌ని, బాగోగులు పట్టించుకోవట్లేదు అని కందాడి జనార్దన్ రెడ్డి మెయింటెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద పేరెంట్స్/సీనియర్ సిటిజన్ ఆక్ట్ 2007 లోని సెక్షన్ 23 ప్రకారం.. అట్టి 18 ఎకరాల 16 గుంటల స్థలం గిఫ్ట్ డీడ్ ని రద్దు చేయాల్సిందిగా కలెక్టర్ కి అప్పీల్ చేసుకున్నాడు. సుదీర్గ వాదోప వాదనలు విన్న తర్వాత సీనియర్ సిటిజన్స్ అయిన తల్లి దండ్రులను చూసుకోవట్లేదు అని నిర్ధారణ అయినందున 18 ఎకరాల 16 గుంటల భూమి గిఫ్ట్ సీడ్ ని రద్దు చేశారు. తల్లిదండ్రుల సంరక్షణ పిల్లల బాధ్యత అని, అది విస్మరిస్తే చట్ట ప్రకారం.. చర్యలు తప్పవని కలెక్టర్ హనుమంతరావు హెచ్చ‌రించారు.

Next Story