- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : అంకతి సత్యం
దిశ, నిడమనూరు : రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేసిన కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలం లోని నారమ్మ గుడెంలో

X
దిశ, నిడమనూరు : రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేసిన కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలం లోని నారమ్మ గుడెంలో ఏర్పాటు చేసిన సన్న రకం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ద్యేయమన్నారు. కొనుగోలు కేంద్రాలతో రైతులకు మద్దతు ధర లభిస్తుందన్నారు. ప్రభుత్వ మార్గ దర్శకాలకు అనుగుణంగా తేమ శాతం తో ధాన్యం విక్రయించాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొండా కృష్ణవేణి, మాజీ వైస్ ఎంపీపీ బైరెడ్డి వెంకటరెడ్డి, ఏపీఎం నరహరి, సీసీ సైదులు, నాయకులు ముంగి శివమారయ్య, బైరెడ్డి సత్యనారాయణ రెడ్డి, గడ్డం గోవిందరెడ్డి, దుబ్బాకుల రాంరెడ్డి, మెరెడ్డి వెంకట రమణ, సోమనబోయిన శ్రీనివాస్, ఒంటెద్దు సునీత తదితరులున్నారు.
Next Story






