సీఎం కేసీఆర్‌కు భాగ్యరెడ్డి సవాల్

by Web Desk |
సీఎం కేసీఆర్‌కు భాగ్యరెడ్డి సవాల్
X



దిశ, చింతలపాలెం: రాజ్యాంగం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ గురువారం సీఎం దిష్టిబొమ్మ దహన కార్యక్రమానికి పిలుపునివ్వడంతో చింతలపాలెం మండలంలోని దొండపాడు గ్రామంలో జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డితోపాటు బీజేపీ నాయకులను అరెస్ట్ చేసీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ అరాచక పాలన కొనసాగిస్తూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని మార్చి కొత్త రాజ్యాంగాన్ని రాయాలన్న కేసీఆర్ వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం అని అన్నారు.

సీఎం కేసీఆర్‌కు భాగ్యరెడ్డి సవాల్

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి సాధించుకుని, రాజ్యాంగం ద్వారానే ముఖ్యమంత్రి అయిన కేసీఆర్, రాజ్యాంగంపై వ్యాఖ్యలు చేయడం అంటే భారత రాజ్యాంగాన్ని అవమానించడమేనని అన్నారు. తక్షణమే కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం ద్వారా గెలిచిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచ్ లతో రాజీనామా చేయించి కల్వకుంట్ల రాజ్యాంగం పేరుతో ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. అరెస్ట్ అయిన వారిలో జిల్లా కార్యదర్శి తోట శేషు, పత్తిపాటి విజయ్, మండల పార్టీ అధ్యక్షుడు లింగరాజు యాదవ్, మామిడి వెంకటేశ్వర్లు, మస్తాన్ రెడ్డి, చిలకల ఎర్రారెడ్డి ఉన్నారు.


Next Story

Most Viewed