రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్న బీజేపీ : ఎమ్మెల్యే

by Naveena |

కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్న బీజేపీ : ఎమ్మెల్యే
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆరోపించారు. జై బాపు, జై బీం, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా.. బుధవారం భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. అమిత్ షా, బీజేపీ పార్టీ గాంధీని, రాజ్యాంగాన్ని, అంబేద్కర్ ను అవమాన పరిచిందని అన్నారు. బీజేపీ పార్టీ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ.. ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతుందన్నారు. గాంధీ, అంబేద్కర్ ఆశయాలను, సిద్ధాంతాలను దేశంలో అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రజలను మేల్కొలిపి చెప్పడం ఈ ప్రచారం యొక్క ముఖ్య లక్ష్యం అని అన్నారు. ఈ‌ కార్యక్రమంలో కార్యక్రమ కోఆర్డినేటర్ సంద్యా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Next Story