కారు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి

by Bhanu |

వెనకవైపు నుండి కారు ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తి మృతి చెందిన సంఘటన కోదాడ మండల పరిధిలోని చిమిర్యాల క్రాస్ రోడ్ వద్ద బుధవారం చోటుచేసుకుంది.

కారు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి
X

దిశ, కోదాడ : వెనకవైపు నుండి కారు ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తి మృతి చెందిన సంఘటన కోదాడ మండల పరిధిలోని చిమిర్యాల క్రాస్ రోడ్ వద్ద బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... చీరాల నుండి హైదరాబాద్ కారులో వెళ్తున్న క్రమంలో మార్గమధ్యంలోని చిమిర్యాల క్రాస్ రోడ్ వద్దఎదురు ముందుగా వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో నారోజు రాఘవ(35) వ్యక్తి అక్కడ అక్కడే మృతి చెందాడు.. మృతుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా కారంపూడి గ్రామానికి చెందిన రాఘవ ఆరు సంవత్సరాల క్రితం కోదాడ వచ్చి జీవనం సాగిస్తున్నారు.

రోడ్డు ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నడు. వృత్తిలో భాగంగా రామపురం ఎక్స్ రోడ్ లో ఫ్లైఓవర్ నిర్మాణం పనులు పరిశీలించి కోదాడకు వస్తున్న క్రమంలో కారు రూపంలో మృత్యువు కబలించింది. మృతుడికి మూడు సంవత్సరాల బాబు ఉన్నాడు. ఈ విషయంపై కోదాడల రూరల్ పోలీస్ స్టేషన్ వివరణ అడగగా మాకు ఇంకా ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు.

Next Story