అభ్యర్థి ఉంటేనే ప్రచారం.. లేకుంటే క్యాడర్లో కనిపించని ఉత్సాహం..!

by Disha Web Desk 12 |
అభ్యర్థి ఉంటేనే ప్రచారం.. లేకుంటే క్యాడర్లో కనిపించని ఉత్సాహం..!
X

దిశ, నల్లగొండ బ్యూరో: కారు గుర్తుకు ఎందుకు ఓటేయాలి...? ఏం ఒరగబెట్టాడనీ.. ఓ ఇల్లు ఇచ్చిండా.. మాకు ఓ నీళ్ల కాలువ ఇచ్చిండా.. ఊరికేమైన రోడ్లేసిండా.."" అంటూ భునగిరి పట్టణానికి చెందిన సామాన్య కూరగాయల అమ్ముకునే ఓ మహిళ రెండు రోజుల క్రితం ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ దుమ్ము దులిపేసింది. ఇలాంటి మాటలు భువనగిరి పార్లమెంట్ అంతటా నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. అందుకే పార్టీకి చెందిన నేతలు క్షేత్రస్థాయిలో ప్రచారానికి వెళ్లడం లేదని విమర్శలున్నాయి.

అభ్యర్థి ఉంటేనే ప్రచారం.. లేకుంటే..!

భువనగిరి పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థిగా హైదరాబాద్‌కు చెందిన క్యామ మల్లేష్ బరిలో ఉన్న విషయం అందరికీ తెలిసింది. అయితే ఆయన పోటీ చెయ్యడం ఎవరికీ పెద్దగా ఆసక్తి లేదు. నియోజకవర్గంలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు సీనియర్ నేతలు పార్టీ ప్రచారాన్ని సొంతంగా నిర్వహించలేక పోతున్నారు. అభ్యర్థి వచ్చిన రోజు మాత్రమే నామ మాత్రంగా ప్రచారం చేస్తున్నారు తప్ప మరొకటి లేదు. అది కూడా ప్రజల ముందుకు ఓటేయమని వెళ్లకుండా నాలుగు గ్రామాలకు సంబంధించిన ఓ 10 మందిని ఒక దగ్గర పోగేసి నాలుగు ముచ్చట్లు చెప్పి వచ్చేస్తున్నారు. మరుసటి రోజు గ్రామంలో కరపత్రం పెంచినోళ్లు లేరూ.. ఓటు ఆడిగినోళ్లు లేరు.. ఓటు వేయమని అడగని వ్యక్తులు.. గెలిచిన తర్వాత తమ సమస్యలు వినడానికి వస్తారంటే ఏలా నమ్ముతామని సామాన్య జనం కూడా చర్చించుకుంటున్నారు

సహకరించని క్యాడర్..

భువనగిరి పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ గెలుపు కోసం ప్రచారం చేయడానికి క్యాడర్ సహకరించడం లేదని చర్చ జరుగుతుంది. భువనగిరి ప్రాంతంలో ఎంతోమంది ఉద్యమకారులు సీనియర్ నేతలు ఉన్నప్పటికీ ప్రాంతానికి పరిచయం లేని వ్యక్తికి టికెట్ ఇచ్చి పంపిస్తే ఎలా సహకరిస్తామని తెలుస్తోంది. భువనగిరి ఆలేరు నియోజకవర్గం జిట్టా బాలకృష్ణ రెడ్డికి, బూడిద బిక్షమయ్యగౌడ్ కు టికెట్ ఇవ్వలేదని వాళ్ళ అనుచర వర్గం అంతా దూరంగా ఉన్నారు. తుంగతుర్తి లో ఉన్న కొద్దిపాటి క్యాడర్ కూడా ప్రచారంలో లేరు. మునుగోడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి పై ఉన్న కోపంతో అభ్యర్థికి సహకరించట్లేదని తెలుస్తుంది. ఇలా ఉంటే మునుగోడు నియోజకవర్గంలో నిర్మాణం ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం బాధితులకు న్యాయం చేయకపోవడం వల్ల అక్కడికి వెళ్లి ఓట్లు అడిగే పరిస్థితి కూడా కార్యకర్తలకు లేదు అభ్యర్థికి లేదు.

సమస్యలపై అవగహనేదీ..

అభ్యర్థి స్థానికతపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఎన్నికల సమయంలో 15 రోజుల ప్రచారంలో కూడా స్థానికంగా ఉండకుండా హైదరాబాద్ నుంచి వస్తుంటే ఎంపీగా గెలిస్తే ఆయనను కలుసుకోవడం ఎట్లా అనే చర్చ కూడా జోరుగా నడుస్తుంది. ఇదిలా ఉంటే స్థానికంగా ఉన్న సమస్యలపై అవగాహన కూడా లేనట్లుందని., ఎక్కడ మాట్లాడినా"" నేను మీ వాడిని.... పేదోడిని... ఓటేసి గెలిపించండి..."" ఈ రెండు మాటలు తప్ప ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై మాట్లాడింది లేదు.... వాటి పరిష్కారానికి తన వద్ద ఉన్న ప్రణాళిక చెప్పేది లేదు. దీనివల్ల కార్యకర్తల్లో కూడా కొంత అసహనం గా ఉన్నారని వినికిడి.

మాజీలు రాజీ పడ్డట్లే..?

భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే లు రాజీ పడ్డట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో గతంలో గెలిచిన ప్రతి ఎమ్మెల్యే గెలుపులో పార్టీ సహకరించిందని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దానికి బదులుగా ఇప్పుడు వాళ్లంతా పక్క పార్టీకి సహకరిస్తున్నట్లు విమర్శలున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎంపీగా పోటీ చేసే అభ్యర్థి " మన ప్రాంతం కాదు... అందులో గెలిచేది లేదు.. ఎందుకు ఈ తిప్పలు "అనే పద్ధతిలో వాళ్ళునట్లు సమాచారం. అందుకే ఈ మాజీ ఎమ్మెల్యే కూడా తన నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలను భుజాలపై మోసేందుకు సిద్ధంగా లేరని వినికిడి. కనీసం తమ కార్యకర్తలను కూడా ప్రచార రంగంలోకి దింపడానికి ఆసక్తిగా లేరని స్వయంగా కార్యకర్తలే పేర్కొన్నారు .

Next Story

Most Viewed