సీఎం రేవంత్ పై నల్గొండ 2 టౌన్ ఎస్సైకి ఫిర్యాదు చేసిన బీసీ విద్యార్థి సంఘం

by Bhanu |

2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని అనాటి టీపీసీసీ అధ్యక్షుడు, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని టూ టౌన్ ఎస్సై ఎర్రం సైదులుకు ఫిర్యాదు చేశారు.

సీఎం రేవంత్ పై నల్గొండ 2 టౌన్ ఎస్సైకి ఫిర్యాదు చేసిన బీసీ విద్యార్థి సంఘం
X

దిశ, నల్లగొండ, కలెక్టరేట్: 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని అనాటి టీపీసీసీ అధ్యక్షుడు, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని టూ టౌన్ ఎస్సై ఎర్రం సైదులుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని, ఆ మేనిఫెస్టోని ఎన్నికలకు అధికారికి కూడా సమర్పించారన్నారు.

రిజర్వేషన్లు, కుల గణన, బీసీ కమీషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీల రిజర్వేషన్ల పెంపు, కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23% నుండి 42%కి పెంపు, పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ, ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ కాంట్రాక్టులలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఏళ్ళు గడుస్తున్నాయన్నారు. బీసీలను విస్మరించినందుకు బీఎన్ఎస్ నూతన చట్టం ప్రకారం ఏ చట్టాలకు వర్తిస్తుందో ఆ చట్టం ప్రకారం కాంగ్రెస్ పార్టీ పైన, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నల్గొండ జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ మున్నాస్ ప్రసన్నకుమార్ , బీసీ జేఎసీ నాయకులు కర్నాటి యాదగిరి, గజ్జి అజయ్ కుమార్, పుట్ట వెంకన్న, చిలక రాజ్ సతీష్, భరత్, రాజు, విజయ చారి, నాగరాజ్, శివ తదితరులు పాల్గొన్నారు.

Next Story