- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తక్షణమే పదవులకు రాజీనామా చేయాలి : అయితగోని జనార్దన్ గౌడ్
దిశ, నల్లగొండ, కలెక్టరేట్ : బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తక్షణమే మీ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న

దిశ, నల్లగొండ, కలెక్టరేట్ : బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తక్షణమే మీ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న గడియారం సెంటర్లో గాడిదలకు బ్యానర్లు కట్టి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా బీసీ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ బీసీలకు చట్టబద్దంగా ఇస్తామన్నా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోగా, బీసీలను నమ్మించడానికి తమ పార్టీ పరంగా బీసీలకు 42 శాతం నుండి 60 శాతం వరకు జనరల్ స్థానాల్లో కూడా అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్, బీజేపీ ప్రకటించాయని, కానీ ఆచరణలో అమలు చేయడానికి కనీస కసరత్తు కూడా చేయడం లేదని ఆయన ఆరోపించారు. బీసీలకు నిజంగానే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం గతంలో తెచ్చిన జీవో నెంబర్ 9 ద్వారా బీసీలకు రాష్ట్ర వ్యాప్తంగా 5300 సర్పంచ్ స్థానాలను అన్ని జిల్లాలలో, వివిధ గ్రామాలను బీసీలకు రిజర్వేషన్ చేసిందని, కనీసం ఈ ప్రతిపదికన అయిన బీసీలకు అవకాశం కల్పిస్తామని ఏ పార్టీ ప్రకటించడం లేదని, దీనిని బట్టి చూస్తే రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేయడానికి ప్రకటనలు గుప్పిస్తారు. తప్ప ఆచరణలో మాత్రం శూన్యమని అన్నారు. అగ్రకుల రాజకీయ పార్టీల మోసాన్ని బీసీలు గ్రహించి బీసీలకు చట్టబద్ధంగా రావలసిన ఆరువేల గ్రామపంచాయతీలు బీసీల వేనని, జనరల్ కోట అంటే అగ్రకులాలకు రిజర్వేషన్ కాదని, బీసీ రిజర్వేషన్లను గండి కొట్టి బీసీ రిజర్వేషన్లకు రావాల్సిన గ్రామ సర్పంచ్ స్థానాలను జనరల్ గా మార్చారని, అందుకే జనరల్ స్థానాలు కూడా బీసీలు కైవసం చేసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా జనరల్ స్థానాలలో సర్పంచులుగా బీసీలు ఎన్నికల బరిలో నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు చిలకరాజు సతీష్‌కుమార్, మార్గం సతీష్‌కుమార్, కర్నాటి యాదగిరి, పుట్ట వెంకన్న గౌడ్, గజ్జి అజయ్ కుమార్ యాదవ్, అనంత నాగరాజు గౌడ్, గడగోజు విజయ్, చెన్నోజు రాజు, దొడ్డు కృష్ణమూర్తి , కొంపల్లి రామన్న గౌడ్ పాల్గొన్నారు.






